Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
Govt of India - Ministry of Railways
Railway Recruitment Board - Secunderabad
Centralised Employment Notice No: 02/2014
 
Jr. Engineers, Sr. Section Engineers Exam
Question Papers and Keys
        భార‌తీయ రైల్వేలోని వివిధ విభాగాల్లో జూనియ‌ర్ ఇంజినీర్‌, డిపో మెటీరియ‌ల్ సూప‌రెంటెండెంట్, కెమిక‌ల్ & మెట‌ల‌ర్జిక‌ల్ అసిస్టెంట్‌, సీనియ‌ర్ సెక్షన్ ఇంజినీర్‌, చీఫ్ డిపో మెటీరియ‌ల్ సూప‌రెంటెండెంట్ పోస్టుల భ‌ర్తీకి వివిధ రిక్రూట్‌మెంట్ బోర్డులు సెప్టెంబ‌రు 20న సెంట్రలైజ్డ్ ప్రక‌ట‌న‌ (ఎంప్లాయిమెంట్ నోటీస్ నెంబ‌ర్‌: 02/2014)ను జారీ చేశాయి. డిసెంబ‌రు 14, 21 తేదీల్లో వీటికి రాత‌ప‌రీక్షల‌ను నిర్వహించాయి. ఆర్ఆర్‌బీ - సికింద్రాబాద్ నిర్వహించిన‌ రాతపరీక్ష ప్రశ్నపత్రాల‌తో పాటు వాటికి నిపుణులు రూపొందించిన 'కీ' ల‌ను అందిస్తున్నాం. ఇవి అభ్యర్థుల అవ‌గాహ‌న కోసం మాత్రమే. బోర్డు విడుద‌ల చేసే జ‌వాబుల‌ను మాత్రమే అంతిమంగా ప‌రిగ‌ణించాలి.
 
ఈ 'కీ'లను రూపొందించిన‌వారు: సీహెచ్‌.కృష్ణప్రసాద్‌, బి. విష్ణువర్ధన్ రెడ్డి, డి. అనంత రామకృష్ణ.
Latest News
» ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలో పెరిగిన జేఈల ఖాళీలు
ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలో పెరిగిన జేఈల ఖాళీలు
హైదరాబాద్‌: ద‌క్షిణ మ‌ధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వేల ప‌రిధిలో జూనియ‌ర్ ఇంజినీర్ల (జేఈ) ఖాళీలు 22 నుంచి 33 కు పెరిగిన‌ట్లు సికింద్రాబాద్ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఛైర్మన్ ఒక ప్రక‌ట‌న‌లో తెలిపారు. సెప్టెంబ‌రు 20న జూనియ‌ర్ ఇంజినీర్‌, సీనియ‌ర్ సెక్షన్ ఇంజినీర్ తదిత‌ర టెక్నిక‌ల్ ఉద్యోగాల భ‌ర్తీకి రైల్వేలు సెంట్రలైజ్డ్ ప్రక‌ట‌న‌ను (ఎంప్లాయిమెంట్ నోటీస్ నెం: 02/2014) జారీ చేశాయి. తాజాగా ఈ ప్రకట‌న‌లోని కేట‌గిరీ నెంబ‌రు 43 నుంచి 55 వ‌ర‌కు ఉన్న వివిధ ర‌కాల జేఈ పోస్టుల సంఖ్యను పెంచిన‌ట్లు బోర్డు ఛైర్మన్ తెలిపారు. అన్ రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరీలో ఖాళీలు 13 నుంచి 20కి, ఎస్సీ - 3 నుంచి 4కి, ఓబీసీ - 22 నుంచి 33 కి పెరిగాయి. ఎస్టీ విభాగంలోని సంఖ్య (1) లో మార్పు లేదు. ఈ పోస్టులకు సంబంధిత విభాగంలోని మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమాను అర్హత‌గా పేర్కొన్నారు. జేఈ పోస్టుల‌కు డిసెంబ‌రు 14న రాత‌ప‌రీక్షల‌ను నిర్వహించ‌నున్నారు.
×