Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ప్రైవేటు సంస్థల్లో న్యాయ‌విద్యకు ఎల్‌శాట్‌
 

న్యాయ‌విద్య కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే క్లాట్ గురించి ఎక్కువ మందికి తెలిసే ఉంటుంది. అయితే ఈ ప‌రీక్ష ద్వారా ప్రభుత్వ క‌ళాశాలల్లోనే ప్రవేశం ల‌భిస్తుంది. ప్రైవేటు విద్యా సంస్థల్లో చేరాలంటే ఆయా క‌ళాశాల‌లు నిర్వహించే ప‌రీక్షను ప్రత్యేకంగా రాసుకోవాలి. ప‌లు ప్రైవేటు సంస్థలు నిర్వహించే ప‌రీక్షల నుంచి విద్యార్థులకు ఉప‌శ‌మ‌నం క‌ల్పించ‌డానికి లా స్కూల్ అడ్మిష‌న్ టెస్ట్ (ఎల్‌శాట్‌)ను భార‌త్‌లో పియ‌ర్‌స‌న్ సంస్థ నిర్వహిస్తోంది. ఈ ప‌రీక్షలో సాధించిన స్కోర్ ద్వారా సుమారు 60 కళాశాల‌ల్లో లా కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. ప్రక‌ట‌న వెలువ‌డిన నేప‌థ్యంలో ప‌రీక్ష విధానం, ప్రవేశ వివ‌రాలు తెలుసుకుందాం.

జాతీయ స్థాయిలో నిర్వహించే రాత ప‌రీక్ష ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. ప‌రీక్ష కోసం దేశ‌వ్యాప్తంగా 16 కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రం హైద‌రాబాద్‌లో మాత్రమే ఉంది. ప‌రీక్షలో సాధించిన స్కోర్‌తో అభ్యర్థి విద్యార్హత‌ల‌ను బ‌ట్టి ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్ బీ, మూడేళ్ల ఎల్ ఎల్ బీ, రెండేళ్ల ఎల్ ఎల్ ఎం కోర్సుల్లో ప్రవేశం క‌ల్పిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క గీతం యూనివ‌ర్సిటీలో మాత్రమే ఈ స్కోర్ ద్వారా లా కోర్సుల్లో చేరే అవ‌కాశం ఉంది. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్‌బీ కోర్సుల‌కు ఇంట‌ర్, మూడేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సుకి డిగ్రీ, రెండేళ్ల ఎల్ ఎల్ ఎం కోర్సులో ప్రవేశానికి ఎల్ఎల్‌బీ పూర్తిచేసిన వారు అర్హులు. ఇంట‌ర్‌, డిగ్రీ, ఎల్ఎల్ బీ చివ‌రి సంవ‌త్సరం విద్యార్థులు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ప‌రీక్ష ఇలా...
ప్రశ్నప‌త్రంలో 4 సెక్షన్లు ఉంటాయి. ఎన‌లిటిక‌ల్ రీజ‌నింగ్‌, ఫ‌స్ట్ లాజిక‌ల్ రీజ‌నింగ్‌, సెకెండ్ లాజిక‌ల్ రీజ‌నింగ్‌, రీడింగ్ కాంప్రహెన్షన్ విభాగాల నుంచి గ‌రిష్ఠంగా వంద ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగం నుంచి 24కు త‌క్కువ కాకుండా ప్రశ్నలుంటాయి. ఒక్కో సెక్షన్‌కు 35 నిమిషాల వ్యవ‌ధిని కేటాయించారు. మొత్తం ప‌రీక్షకు 2 గంట‌ల 20 నిమిషాల స‌మ‌యం కేటాయించారు. ప్రశ్నల‌న్నీ మ‌ల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటాయి. కొన్ని ప్రశ్నల‌కు 4, మ‌రికొన్ని ప్రశ్నల‌కు 5 ఆప్షన్లు ఉంటాయి. రుణాత్మక మార్కులు లేవు. ప‌రీక్ష ఆఫ్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. ఓఎంఆర్ ప‌త్రంపై పెన్సిల్‌తో స‌మాధానాలు రాయాలి. మోడ‌ల్‌, ప్రాక్టీస్ ప్రశ్నప‌త్రాల‌ను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచారు. వాటిద్వారా అభ్యర్థులు ప్రశ్నప‌త్ర స్థాయి, ప్రశ్నల స‌ర‌ళిపై అవ‌గాహ‌న‌కు రావ‌చ్చు.

విభాగాల‌వారీ ప్రశ్నలు ఇలా..
ఎన‌లిటిక‌ల్ రీజ‌నింగ్‌: ఇచ్చిన స‌మాచారం, అందులోని వ్యాఖ్యలు, నియ‌మాలు ఉప‌యోగించి స‌మాధానం గుర్తించాలి. మ‌నుషులు, వ‌స్తువులు, సంఘ‌ట‌న‌ల స‌మాచారం ఇచ్చి వాటిమ‌ధ్య సంబంధం క‌నుక్కోమంటారు. సూత్రాలు ఆధారంగా స‌మాధానం గుర్తించేలా మ‌రికొన్ని ప్రశ్నలు అడుగుతారు.
లాజిక‌ల్ రీజ‌నింగ్: విశ్లేష‌ణ‌, త‌ర్కం, సునిశిత ప‌రిశీల‌న‌తో ముడిప‌డే ప్రశ్నలు ఈ విభాగంలో అడుగుతారు. చిన్నచిన్న పేరాల్లో స‌మాచారం ఇచ్చి దాని ఆధారంగా ప్రశ్నలుంటాయి. అయితే ఇచ్చిన స‌మాచారాన్ని త‌ర్కంతో విశ్లేషించడానికి సునిశిత ప‌రిశీల‌న త‌ప్పనిస‌రి. కొన్ని ప్రశ్నల‌కు నియ‌మాలు, సూత్రాలు ఉప‌యోగించాల్సి ఉంటుంది. భిన్న కోణంలో ఆలోచించ‌డం ద్వారా ఎక్కువ ప్రశ్నల‌కు స‌మాధానాలు రాబ‌ట్టవ‌చ్చు.
రీడింగ్ కాంప్రహెన్షన్‌: పెద్ద వ్యాసాన్ని ఇచ్చి దానిలోని స‌మాచారం ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతారు. ఇలాంటివి నాలుగు వ్యాసాలు ఉంటాయి. ఇచ్చిన స‌మాచారాన్ని త‌ర్కంతో ఆలోచించి చ‌దివితే స‌మాధానం రాబ‌ట్టడం తేలిక‌వుతుంది.

ఇత‌ర ప‌రీక్షల‌తో పోల్చుకుంటే...
లీగ‌ల్, క‌రెంట్ అఫైర్స్‌, మ్యాథ్స్, గ్రామ‌ర్ అంశాల‌కు మిగిలిన లా ప‌రీక్షల్లో ప్రాధాన్యం ఉంటుంది. కానీ ఎల్‌శాట్‌లో క్రిటిక‌ల్ థింకింగ్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. న్యాయ‌శాస్త్ర విద్యను అభ్యసించ‌డానికి క్రిటిక‌ల్ థింకింగ్ ఉంటే స‌రిపోతుంద‌ని ఎల్‌శాట్ నిర్వహకుల భావ‌న‌. ఎల్‌శాట్‌లో నెగెటివ్ మార్కులు కూడా ఉండ‌వు. అలాగే సెక్షన్లవారీ కేటాయించిన స‌మ‌యాల్లోనే ఆయా సెక్షన్లకు జ‌వాబులు గుర్తించాలి. ఒక సెక్ష‌న్లో మిగుల్చుకున్న స‌మ‌యాన్ని మ‌రో సెక్షన్ జ‌వాబులు గుర్తించ‌డానికి అనుమ‌తించ‌రు. ప‌రీక్ష స‌మ‌యానికంటే ముందుగానే ప్రశ్నప‌త్రం పూర్తిచేసుకున్నప్పటికీ మిగిలిన స‌మ‌యాన్ని చివ‌ర‌గా జ‌వాబులు గుర్తించిన సెక్షన్‌కు త‌ప్ప మిగ‌తా సెక్షన్లకు వెచ్చించ‌డ‌మూ కుద‌ర‌దు.

ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి
ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ల‌కు చివ‌రి తేదీ: మే 4, 2018
ప‌రీక్ష తేదీ: మే 20, 2018
రిజిస్ట్రేష‌న్ ఫీజు: రూ. 3800
వెబ్‌సైట్: http://www.pearsonvueindia.com/lsatindia/
ప్ర‌వేశం క‌ల్పించే సంస్థ‌ల వివ‌రాలు
Alliance School of Law
(Alliance University, Bangalore)

ITM Law School - Gurgaon
(ITM University, Gurgaon)

School of law, Ansal University – Gurgaon
(A constituent of Ansal University, Gurgaon)

AURO University School of Law - Surat
(Affiliated to AURO University, Surat)

Jindal Global Law School - Sonipat (Haryana)
(Jindal Global University)

School of Law, Gitam University - Visakhapatnam (AP)
(A Constituent of Gitam University, Visakhapatnam)

Central India College of Law, Godhani - Nagpur
(Affiliated to RTM, Nagpur University)

JSS Law College – Mysore
(Autonomous under Karnataka State Law University, Hubli)

School of Law, K. R. Mangalam University - Gurgaon
(A Constituent of K. R. Mangalam University, Gurgaon)

College of Legal Studies - Dehradun
(UPES, Dehradun)

K.L.E. Society’s Law College – Bangalore
(Affiliated to Karnataka State Law University)

School of Law, Noida International University
(Noida International University)

Faculty of Law - Dehradun
(A constituent of ICFAI University)

MATS Law School, MATS University - Raipur
(MATS University)

School of Law, Sharda University - Greater Noida
(A Constituent of Sharda University, Greater Noida)

G H Raisoni Law School - Nagpur
(Affiliated to RTM Nagpur University)

Rajiv Gandhi School of Intellectual Property Law (RGSOIPL) - 3 yr LL.B.
(IIT Kharagpur)

VIT Law School – Chennai (Tamil Nadu)
(A constituent of VIT University, Vellore)

Altius Institute of Universal Studies - Indore
(Affiliated to Devi Ahilya Vishwa Vidyalaya)

IMS Unison University, Dehradun

NIMS Law School –Jaipur
(Recognized by UGC)

B. M. S. College of Law, Bangalore
(Affiliated to Karnataka State Law University)

Institute of Law and Research – Faridabad
(Affiliated to M.D. University, Rohtak)

NIMT Vidhi Evam Kanun Sansthan, Greater Noida
(Affiliated to Chaudhary Charan Singh University, Meerut)

B.N. Law College - Udaipur
(Affiliated to Mohanlal Sukhadia University Udaipur)

Jayoti Vidyapeeth Women's University, Jaipur
(Affiliated to Jayoti Vidyapeeth Women's University)

Royal College of Law - Ghaziabad
(Affiliated to Chaudhary Charan Singh University, Meerut)

B.S. Anangpuria Institute of Law - Faridabad
(Affiliated to Maharshi Dayanand University, Rohtak)

Jagan Nath University, Law Faculty – Jaipur
(Affiliated to Jagan Nath University)

R. N. Patel Ipcowala School of Law and Justice
(Sardar Patel University, Vallabh Vidyanagar, Anand, Gujarat)

Chanakya Law College - Rudrapur
(Affiliated to Kumaun University, Nainital)

Jai Hind Defence College of Law - Bhopal
(Affiliated to Barkatullah University)

Sardar Patel Subharti Institute of Law - Meerut
(Affiliated to Swami Vivekananda Subharti University)

Dr. Anushka Vidhi Mahavidyalaya - Udaipur
(Affiliated to Mohan Lal Sukhdev University)

K.L.E. Society’s B. V. Bellad Law College – Belgaum
(Affiliated to Karnataka State Law University)

Sri Vaishnav Institute of Law - Indore
(Affiliated to Devi Ahiliya Vishwavidyalaya)

Durgapur Institute of Legal Studies – Durgapur
(Affiliated to University of Burdwan)

K.L.E. Society's Gurusiddappa Kotambri Law College – Hubli
(Affiliated to Karnataka State Law University, Hubli)

Siddhartha Law College - Dehradun
(Affiliated to Uttarakhand Technical University)

Geeta Institute of Law - Panipat
(Affiliated to Kurukshetra University)

M A B Institute of Juridicial Science - Murshidabad
(Affiliated to Kalyani University)

Haldia Law College – Midnapore
(Affiliated to The Vidyasagar University)

Midnapore Law College, Midnapore (WB)
(Affiliated to Vidyasagar University)

Tagore Institute of Law – Jaipur
(Affiliated to University of Rajasthan)

IMS Law College – Noida
(Affiliated to CCS University, Meerut)

M.L. & G.E. Society's Manikchand Pahade Law College – Aurangabad
(Affiliated to Dr. Babasaheb Ambedkar Marathwada University)

Vaikunta Baliga College of Law - Udupi
(Affiliated to Karnataka State Law University, Hubli)