Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
విద్యార్థులకు ఓఎన్‌జీసీ చేయూత

వృత్తివిద్యా కోర్సయినా, పీజీ అయినా కోర్సు ముగిసేవరకూ ప్రతినెలా ఉపకారవేతనం లభిస్తే... ఆర్థికంగా అదెంతో ఆసరా. తాజాగా ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఓఎన్‌జీసీ) వెయ్యి ఉపకారవేతనాలను ప్రకటించింది! దీనిలో భాగంగా.. ఇంజినీరింగ్‌, ఎంబీబీఎస్‌, ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్‌ కోర్సులు చదువుతోన్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల నుంచి ప్రతిభావంతులను ఎంపిక చేసి, నెలకు రూ.4000 చొప్పున స్కాలర్‌షిప్పుగా చెల్లిస్తారు. ప్రతి కోర్సులోనూ 50 శాతం ఉపకారవేతనాలను మహిళలకు కేటాయించారు. ఇంజినీరింగ్‌, ఎంబీబీఎస్‌ కోర్సులకు ఇంటర్లో చూపిన ప్రతిభ ఆధారంగా; ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్‌ కోర్సులకు డిగ్రీలో ప్రతిభ ప్రాతిపదికన స్కాలర్‌షిప్పులు మంజూరు చేస్తారు. దేశంలోని రాష్ట్రాలను 5 జోన్లుగా విభజించి, ఒక్కో జోన్‌ కింద 200 స్కాలర్‌షిప్పులు కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు జోన్‌-5లో ఉన్నాయి. అభ్యర్థులు పైన పేర్కొన్న కోర్సుల్లో ఎందులోనైనా గుర్తింపు పొందిన సంస్థల్లో ప్రస్తుతం ప్రథమ సంవత్సరంలో చేరి ఉండాలి. ఇంజినీరింగ్‌, ఎంబీబీఎస్‌ అభ్యర్థులైతే ఇంటర్లో కనీసం 60 శాతం మార్కులు; ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్‌ కోర్సుల్లో చేరినవారు డిగ్రీలో 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.4.5 లక్షల లోపు ఉంటేనే స్కాలర్‌షిప్పుకు అర్హత లభిస్తుంది. అభ్యర్థుల వయసు నవంబరు 1, 2018 నాటికి 30 ఏళ్లకు మించరాదు. పైన తెలిపిన కోర్సుల్లో భారత్‌లో చదివిన విద్యార్థులు మాత్రమే అర్హులు. వేరే ఏ స్కాలర్‌షిప్పులూ మంజూరు కానివారే ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్పుకి అర్హులు. ఫీజు రీ-ఇంబర్స్‌మెంట్‌ ద్వారా లబ్ధి పొందేవారు ఈ స్కాలర్‌షిప్పుకి అర్హులే.
దరఖాస్తును ఓఎన్‌జీసీ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దరఖాస్తుతోపాటు నిర్దేశిత సర్టిఫికెట్లు జతచేయాలి.
(కులధ్రువీకరణ పత్రం, వయసు నిర్ధరణకు పదోతరగతి మార్కుల జాబితా, ఇంటర్‌ లేదా డిగ్రీ మార్కులు, తల్లిదండ్రుల ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు అకౌంట్‌ వివరాలు, పాన్‌ కార్డు ఉంటే జతచేయాలి.)
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల విద్యార్థులు దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Incharge, HR/ER, ONGC,
7th floor, East wing,
CMDA towern-1, N
on-1 Gandhi Irwin road,
Egmore,
Chennai- 600008.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జనవరి 21, 2019
వెబ్‌సైట్‌: www.ongcindia.com

Posted on 29-11-2018