రైల్వేలో ఉద్యోగాల మేళా!

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు భారీ ప్రకటన విడుదల చేసింది. 2012 తరువాత తిరిగి ఆయా విభాగాల్లోని పోస్టుల్లో దేశవ్యాప్తంగా 18,252 పోస్టుల నియామకాలు జరపనున్నది. డిగ్రీ పూర్తిచేసిన ఉద్యోగార్థులకు ఇదో శుభవార్త!
జోన్లవారీగా ఈ రైల్వే పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఏ రాష్ట్రానికి చెందినవారైనా దేశంలో వారికి నచ్చిన జోన్లకు దరఖాస్తు చేయవచ్చు. ఉదా: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల అభ్యర్థులు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే, ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జోన్లే కాకుండా దేశంలోని ఏ జోన్‌కైనా దరఖాస్తు చేయవచ్చు.ఇండియన్ రైల్వేలో 18,252 ఖాళీలు

* వీటిలో 5942 అసిస్టెంట్ స్టేష‌న్ మాస్టర్‌, 7591 గూడ్స్ గార్డులు
* అన్ని పోస్టుల‌కూ అర్హత డిగ్రీ
* కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక‌
* ఏక ప‌రీక్ష ద్వారా నియామ‌కాలు
* ప్రతి జిల్లాలోనూ ప‌రీక్ష కేంద్రం

సౌత్ సెంట్రల్ రైల్వేలో 2030 మ‌హిళా కానిస్టేబుల్ పోస్టులు

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు/ రైల్వే ప్రొటెక్షన్ స్పెష‌ల్ ఫోర్సులో 2030 మ‌హిళా కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి ద‌క్షిణ మ‌ధ్య రైల్వే, సికింద్రాబాద్ ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. ప‌దోత‌ర‌గ‌తి పాసైన మ‌హిళా అభ్యర్థులంద‌రూ ఈ ఉద్యోగానికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.