Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
రైల్వేలో 2786 టెక్నిక‌ల్‌ పోస్టులు
 
- 1315 జేఈ, 1309 ఎస్ఎస్ఈ ఖాళీలు
- డిప్లొమా, ఇంజినీరింగ్ అభ్యర్థుల‌కు అవ‌కాశం
- ఐబీపీఎస్ త‌ర‌హాలో ఆన్‌లైన్‌లోనే ప‌రీక్షలు
- వివిధ జిల్లాల్లో ప‌రీక్ష కేంద్రాలు

ఆర్ఆర్‌బీ ప‌రీక్షలంటే ఎంత డిమాండో అంద‌రికీ తెలిసిందే. ఉద్యోగానికి భ‌ద్రత‌, చెప్పుకోద‌గ్గ వేత‌నాలు, ప‌లు స‌దుపాయాలు...దీంతో గ్రామీణ యువ‌త‌తోపాటు ప‌ట్టణాలు, న‌గ‌రాల‌కు చెందిన‌వారు కూడా రైల్వే ఉద్యోగాల‌పై ఆస‌క్తి చూపుతున్నారు. అలాగే దేశంలో ఎక్కువ మందికి ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తున్న సంస్థ కూడా రైల్వేనే. తాజాగా వివిధ రైల్వే జోన్లలో 2786 టెక్నిక‌ల్ పోస్టుల భర్తీకి ఆర్ఆర్‌బీ ప్రక‌ట‌న వెలువ‌డింది.