Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

* ఆన్‌లైన్ ప‌రీక్ష, గ్రూప్ డిస్కష‌న్‌, ఇంట‌ర్వ్యూల ద్వారా నియామ‌కాలు
* ఎంపికైన‌వారికి ఏడాది పీజీడీబీఎఫ్‌ కోర్సు
* అనంత‌రం పీవో కొలువు

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒక‌టైన సిండికేట్ 500 ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. సింగిల్ స్టేజ్ ఆన్‌లైన్ ప‌రీక్ష (ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌), గ్రూప్ డిస్కష‌న్‌, ఇంట‌ర్వ్యూల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. అనంత‌రం మ‌ణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్‌ -మంగుళూరు లేదా ఎన్ఐటీటీఈ యూనివ‌ర్సిటీ- గ్రేట‌ర్ నోయిడాల్లో ఏదో ఒక చోట‌ ఏడాది వ్యవ‌ధితో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌ (పీజీడీబీఎఫ్‌) కోర్సు చ‌ద‌వాల్సి ఉంటుంది. విజ‌య‌వంతంగా కోర్సును పూర్తిచేసుకున్నవారిని ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్ (పీవో)/ అసిస్టెంట్ మేనేజ‌ర్ హోదాతో సిండికేట్ బ్యాంక్‌లోకి తీసుకుంటారు. ప్రక‌ట‌న‌కు సంబంధించి పూర్తి స‌మాచారం తెలుసుకుందాం.

ఆన్‌లైన్ ప‌రీక్ష ఇలా...
రీజ‌నింగ్‌, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ (బ్యాంకింగ్ అంశాల‌కు ప్రాధాన్యం) ఒక్కో విభాగం నుంచి 50 ప్రశ్నలు వ‌స్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 200 మార్కుల‌కు ప‌రీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నప‌త్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ప‌రీక్ష వ్యవ‌ధి 2 గంట‌లు. అనంత‌రం ఆన్‌లైన్‌లోనే ఇంగ్లిష్ లాంగ్వేజ్‌పై డిస్క్రిప్టివ్ ప‌రీక్ష నిర్వహిస్తారు. ఇందులో భాగంగా 2 ప్రశ్నల‌కు వ్యాస‌రూపంలో స‌మాధానాలు రాయాలి. ప‌రీక్ష వ్యవ‌ధి 30 నిమిషాలు. ఆబ్జెక్టివ్ ప‌రీక్షలో సెక్షన్లవారీ క‌టాఫ్‌లు ఉంటాయి. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థుల డిస్క్రిప్టివ్ పేప‌ర్‌ను మూల్యాంక‌నం చేస్తారు. డిస్క్రిప్టివ్ ప‌రీక్షలో అర్హత సాధిస్తే స‌రిపోతుంది. ఈ ప‌రీక్షలో జ‌న‌ర‌ల్ అభ్యర్థులైతే 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఓబీసీలు 45 శాతం మార్కులు సాధిస్తే అర్హులుగా ప‌రిగ‌ణిస్తారు. ఈ పేప‌ర్‌లో సాధించిన మార్కుల‌ను తుది నియామ‌కంలో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు. ఆబ్జెక్టివ్ ప‌రీక్షలో రుణాత్మక మార్కులు ఉన్నాయి.

జీడీ, ఇంట‌ర్వ్యూ...
డిస్క్రిప్టివ్ ప‌రీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల‌కు ముందుగా జీడీ త‌ర్వాత ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తారు. ఆయా కేట‌గిరీల‌వారీ ఖాళీల‌కు అయిదు రెట్ల సంఖ్యంలో అభ్యర్థుల‌ను జీడీ, ఇంట‌ర్వ్యూ ల‌కు ఎంపిక‌చేస్తారు. జీడీ, ఇంట‌ర్వ్యూ ప్రశ్నల‌కు ఇంగ్లిష్ లేదా హిందీ మాధ్యమంలో జ‌వాబులు చెప్పాలి.

తుదినియామ‌కాలు
ఆన్‌లైన్ ప‌రీక్ష (ఆబ్జెక్టివ్‌), జీడీ, ఇంట‌ర్వ్యూ లో సాధించిన మార్కుల ద్వారా తుది నియామ‌కాలు చేప‌డ‌తారు.

ఎంపికైతే...
ఎంపికైన‌వాళ్లు మ‌ణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్‌ -మంగుళూరు లేదా ఎన్ఐటీటీఈ యూనివ‌ర్సిటీ- గ్రేట‌ర్ నోయిడాల్లో ఏదో ఒక చోట‌ ఏడాది వ్యవ‌ధితో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌ (పీజీడీబీఎఫ్‌) కోర్సు చ‌ద‌వాల్సి ఉంటుంది. వ‌స‌తి, భోజ‌నం, కోర్సు, ఇత‌ర అన్ని ర‌కాల ఫీజులు క‌లుపుకుని ఎంపికైన‌వాళ్లు రూ.3.5 లక్షలు చెల్లించాలి. ఈ మొత్తానికి త‌క్కువ వ‌డ్డీకి రుణ స‌దుపాయం క‌ల్పిస్తారు. ఉద్యోగంలోకి చేరిన త‌ర్వాత 84 సుల‌భ వాయిదాల్లో దీన్ని చెల్లించుకోవ‌చ్చు. ఈ ఏడాది వ్యవ‌ధిలో 9 నెల‌ల త‌ర‌గ‌తి శిక్షణ మ‌ణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్‌ -మంగుళూరు లేదా ఎన్ఐటీటీఈ యూనివ‌ర్సిటీ- గ్రేట‌ర్ నోయిడాల్లో నిర్వహిస్తారు. చివ‌రి మూడు నెల‌లు ఏదైనా సిండికేట్ బ్యాంకు శాఖ‌లో ఇంట‌ర్న్‌షిప్ చేయాలి. నెల‌కు రూ.3000 చొప్పున మొద‌టి 9 నెల‌లు స్టైపెండ్‌గా చెల్లిస్తారు. చివ‌రి 3 నెల‌లు నెల‌కు రూ. 15,000 ఇస్తారు. విజ‌య‌వంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి మ‌ణిపాల్ యూనివ‌ర్సిటీ / ఎన్ఐటీటీఈ పీజీడీబీఎఫ్ డిగ్రీని ప్రదానం చేస్తుంది. ఉద్యోగంలోకి చేరిన‌వాళ్లు అయిదేళ్ల స‌ర్వీసు పూర్తి చేసుకున్న త‌ర్వాత ఆరో ఏడాది నుంచి ప‌దో ఏడాది వ‌ర‌కు మొత్తం అయిదేళ్లపాటు ఏడాదికి రూ.ల‌క్ష చొప్పున సిండికేట్ బ్యాంకు అభ్యర్థుల‌కు జీతంతోపాటు అద‌నంగా చెల్లిస్తుంది.

ఖాళీలు...అర్హత‌లు..వ‌యఃప‌రిమితి..:
మొత్తం ఖాళీలు: 500. వీటిలో అన్ రిజ‌ర్వ్‌డ్‌-252, ఓబీసీ-135, ఎస్సీ-75 , ఎస్టీ-38 ఖాళీలు ఉన్నాయి.
అర్హత‌: 60 శాతం మార్కుల‌తో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55 శాతం మార్కులు. (సెప్టెంబ‌రు 30, 2017 నాటికి అభ్యర్థులు ఉత్తీర్ణులై ఉండాలి)
వ‌యోప‌రిమితి: అక్టోబ‌రు 1, 2017 నాటికి క‌నిష్ఠం 20, గ‌రిష్ఠంగా 28 ఏళ్లు. అంటే అక్టోబ‌రు 2, 1989 కంటే ముందు; అక్టోబ‌రు 1, 1997 త‌ర్వాత జ‌న్మించిన‌వాళ్లు అన‌ర్హులు.ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు, దివ్యాంగుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: జ‌న‌వరి 2, 2018
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: జ‌న‌వ‌రి 17, 2018
ద‌ర‌ఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు రూ.100. మిగిలిన అంద‌రికీ రూ.600.
కాల్ లెట‌ర్లు: ఫిబ్రవ‌రి 5 త‌ర్వాత డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.
ప‌రీక్ష తేదీ: ఫిబ్రవ‌రి 18, 2018
తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్‌, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, నెల్లూరు, ఒంగోలు, రాజ‌మండ్రి, శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌.
వెబ్‌సైట్‌: www.syndicatebank.in