Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఉన్నత బోధ‌నా ప్రమాణాల‌కు చిరునామా హెచ్‌సీయూ
 


అన్ని యూనివ‌ర్సిటీల్లోనూ ఇంచుమించు ఒకే ర‌క‌మైన కోర్సులు ఉంటాయి. కానీ కొన్ని సంస్థల్లో చ‌దివిన విద్యార్థుల‌కే గుర్తింపు ఉంటుంది. అలాంటివాటిలో హైద‌రాబాద్ యూనివ‌ర్సిటీ (సెంట్రల్ యూనివ‌ర్సిటీ) ముందు వ‌రుస‌లో ఉంటుంది.. ఈ యూనివ‌ర్సిటీ వ‌చ్చే విద్యా సంవ‌త్సరం వివిధ కోర్సుల్లో (ఇంటిగ్రేటెడ్ పీజీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంఫిల్‌, పీహెచ్‌డీ) ప్రవేశానికి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. ఈ నేప‌థ్యంలో హెచ్‌సీయూలో అందుబాటులో ఉన్న కోర్సులు, వాటిలోని సీట్ల వివ‌రాలు, ఎంపిక విధానం...త‌దిత‌ర విష‌యాల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

ఇంట‌ర్ విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ పీజీ
ఇంటిగ్రేటెడ్ విధానంలో ఐదేళ్ల ఎంఏ, ఎమ్మెస్సీ కోర్సుల‌ను ప‌లు విభాగాల్లో హెచ్‌సీయూ అందిస్తోంది. అంటే డిగ్రీ, పీజీ రెండూ యూనివ‌ర్సిటీ క్యాంప‌స్‌లోనే విద్యార్థులు చ‌దువుకోవ‌చ్చు. అనుభ‌వ‌జ్ఞులైన ప్రొఫెస‌ర్లు, అధునాత‌న ల్యాబ్‌, లైబ్రరీ సౌక‌ర్యాలు ఇవ‌న్నీ హెచ్‌సీయూ విద్యార్థుల సొంతం. సాధార‌ణ క‌ళాశాల‌ల్లో బోధించే డిగ్రీ కోర్సుల‌కు ఈ యూనివ‌ర్సిటీ క్యాంప‌స్‌లో అందించే ఇంటిగ్రేటెడ్‌ స‌బ్జెక్టుల‌కు చాలా వ్యత్యాసం ఉంటుంది.

ఇంటిగ్రేటెడ్ కోర్సు, సీట్లు, అర్హత వివ‌రాలు
ఎమ్మెస్సీ కోర్సులు
కోర్సులు: ఎమ్మెస్సీ మ్యాథ‌మెటిక‌ల్ సైన్సెస్‌, ఫిజిక్స్‌, కెమిక‌ల్ సైన్సెస్‌, సిస్టమ్స్ బ‌యాల‌జీ
సీట్లు: ఒక్కో విభాగంలో 16 చొప్పున సీట్లు ఉన్నాయి
అర్హత‌: సైన్స్ స‌బ్జెక్టుల్లో 60 శాతం మార్కుల‌తో ఇంట‌ర్ లేదా ప్లస్ టు ఉత్తీర్ణత‌

మిన‌హాయింపు: కేవీపీవై ఫెలోషిప్‌కు ఎంపికైన‌వారు, సైన్స్ ఒలంపియాడ్‌కు ఎంపికై హోమీ భాభా సెంట‌ర్ ముంబైలో శిక్షణ తీసుకున్నవారు, జేఈఈ మెయిన్ లిస్ట్‌లో ర్యాంకు సాధించిన‌వారు, వివిధ రాష్ట్ర బోర్డుల ప‌రీక్షల్లో ప్రథ‌మ స్థానం పొందిన‌వారు ప‌రీక్ష రాయ‌కుండా నేరుగా ప్రవేశం పొందే అవ‌కాశం క‌ల్పించారు.
కోర్సు: ఎమ్మెస్సీ ఎర్త్ సైన్సెస్‌
సీట్లు: 8
అర్హత‌: సైన్స్ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణత‌

కోర్సు: ఎమ్మెస్సీ హెల్త్ సైకాల‌జీ
సీట్లు: 16
అర్హత‌: 60 శాతం మార్కుల‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణత (ఆర్ట్స్‌, సైన్స్ ఏ గ్రూప్ విద్యార్థులైనా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు)

కోర్సు: ఎమ్మెస్సీ ఆప్టోమెట్రీ అండ్ విజ‌న్ సైన్సెస్‌
సీట్లు: 20
అర్హత‌: సైన్స్ గ్రూప్‌ల్లో 60 శాతం మార్కుల‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణత‌

ఎంఏ కోర్సులు (హ్యుమానిటీస్‌)
కోర్సు: తెలుగు
సీట్లు: 15
కోర్సు: హిందీ
సీట్లు: 8
కోర్సు: లాంగ్వేజ్ సైన్సెస్‌
సీట్లు: 15
అర్హత‌: పై మూడు కోర్సుల‌కు ఇంట‌ర్‌లో ఏ గ్రూప్‌తోనైనా 60 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణత సాధించిన‌వారు అర్హులు

ఎంఏ కోర్సులు (సోష‌ల్ సైన్సెస్‌)
కోర్సు: ఎక‌నామిక్స్‌
సీట్లు: 11
కోర్సు: హిస్టరీ
సీట్లు: 10
కోర్సు: పొలిటిక‌ల్ సైన్స్‌
సీట్లు: 10
కోర్సు: సోషియాల‌జీ
సీట్లు: 11
కోర్సు: ఆంత్రోపాల‌జీ
సీట్లు: 10
అర్హత‌: పైన పేర్కొన్న అన్ని సోష‌ల్ సైన్సెస్ కోర్సుల‌కు ఏ గ్రూప్‌లోనైనా 60 శాతం మార్కుల‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ప‌రీక్ష ఇలా..
పైన తెలిపిన అన్ని ఇంటిగ్రేటెడ్ (ఎంఏ, ఎమ్మెస్సీ) కోర్సుల‌కూ రాత ప‌రీక్ష ద్వారా ప్రవేశం క‌ల్పిస్తారు. దేశ‌వ్యాప్తంగా 35 కేంద్రాల్లో ప‌రీక్ష నిర్వహిస్తారు. ప‌రీక్ష వ్యవ‌ధి 2 గంట‌లు. ప్రశ్నల‌న్నీ ఇంట‌ర్ స్థాయిలోనే ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. ప్రతి త‌ప్పు స‌మాధానానికీ మూడో వంతు మార్కులు త‌గ్గిస్తారు. మ్యాథ‌మెటిక‌ల్ సైన్సెస్‌, ఫిజిక్స్‌, కెమిక‌ల్ సైన్సెస్‌, సిస్టమ్స్ బ‌యాల‌జీ అండ్ ఎర్త్ సైన్సెస్ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప‌రీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 మార్కుల‌కు ప్రశ్నప‌త్రం ఉంటుంది. నాలుగు సెక్షన్లలో ప్రశ్నల‌డుగుతారు. ఒక్కో సెక్షన్‌కు 25 మార్కులు కేటాయించారు. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బ‌యాల‌జీ ఈ నాలుగు సెక్షన్ల నుంచి ఇంట‌ర్ స్థాయిలో ప్రశ్నలుంటాయి. ప‌రీక్ష కోసం బైపీసీ విద్యార్థులు మ్యాథ్స్‌, ఎంపీసీ విద్యార్థులు బ‌యాల‌జీ అద‌నంగా చ‌దువుకోవ‌డం త‌ప్పనిస‌రి. విద్యార్థులు వారి ప్రాధాన్యం అనుస‌రించి కోర్సులను ఎంచుకోవాలి. రాత ప‌రీక్షలో చూపిన ప్రతిభ‌, ప్రాధాన్యం ప్రకారం సీట్లు కేటాయిస్తారు.
ఎమ్మెస్సీ హెల్త్ సైకాల‌జీ కోర్సుకి ద‌ర‌ఖాస్తు చేసుకున్నవారికి కూడా వంద మార్కుల‌కు ప్రశ్నప‌త్రం ఉంటుంది. ప‌రీక్షలో సైకాల‌జీ (ఇంట‌ర్ స్థాయి), ఇంగ్లిష్‌లో అవ‌గాహ‌న‌పై ప్రశ్నలుంటాయి.
ఇంటిగ్రేటెడ్ ఎంఏ హ్యుమానిటీస్ (తెలుగు, హిందీ, లాంగ్వేజ్ సైన్స్‌) కోర్సుల‌కు ఉమ్మడి ప‌రీక్ష నిర్వహిస్తారు. వంద మార్కుల ప్రశ్నప‌త్రంలో ఎ,బి,సి అనే మూడు విభాగాలు ఉంటాయి. పార్ట్ ఎలో 40 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. అభ్యర్థి ప్రవేశం కోరుకునే స‌బ్జెక్టు నుంచి ఈ ప్రశ్నలు అడుగుతారు. పార్ట్ బి, పార్ట్ సి అంద‌రికీ ఉమ్మడి అంశాలే. పార్ట్ బిలో 35 ప్రశ్నలు ఆంగ్ల భాషా ప్రావీణ్యంపై అడుగుతారు. పార్ట్ సిలో 25 ప్రశ్నలు వ‌ర్తమాన వ్యవ‌హారాలు, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ అంశాల నుంచి వ‌స్తాయి. మెరిట్ ప్రకారం అభ్యర్థి ఎంచుకునే కోర్సులోనే ప్రవేశం ల‌భిస్తుంది.

రెండేళ్ల పీజీ సైన్స్ కోర్సులు
కోర్సు: ఎమ్మెస్సీ మ్యాథ్స్‌/ అప్లైడ్ మ్యాథ్స్‌
సీట్లు: 40
అర్హత‌: మ‌్యాథ్స్ లేదా స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా 60 శాతం మార్కుల‌తో డిగ్రీ పూర్తిచేసిన‌వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

కోర్సు: ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌
సీట్లు: 20
అర్హత‌: మ‌్యాథ్స్ లేదా స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా 60 శాతం మార్కుల‌తో డిగ్రీ పూర్తిచేసిన‌వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

కోర్సు: ఎమ్మెస్సీ ఫిజిక్స్‌
సీట్లు: 45
అర్హత‌: ఫిజిక్స్‌, మ్యాథ్స్ స‌బ్జెక్టుల‌తో బీఎస్సీలో 60 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణత లేదా ఫిజిక్స్‌, మ్యాథ్స్‌, ఎల‌క్ట్రానిక్స్ స‌బ్జెక్టుల‌తో 55 శాతం మార్కుల‌తో డిగ్రీ ఉత్తీర్ణత‌

కోర్సు: ఎమ్మెస్సీ కెమిస్ట్రీ
సీట్లు: 45
అర్హత‌: కెమిస్ట్రీ స‌బ్జెక్టుతో ఫిజిక్స్ లేదా మ్యాథ్స్ కాంబినేష‌న్‌గా బీఎస్సీలో 60 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణత‌
కోర్సు: ఎమ్మెస్సీ బ‌యోకెమిస్ట్రీ
సీట్లు: 28
అర్హత‌: డిగ్రీలో బ‌యెకెమిస్ట్రీ లేదా కెమిస్ట్రీ ఒక స‌బ్జెక్టుగా 60 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణత‌

కోర్సు: ఎమ్మెస్సీ ప్లాంట్ బ‌యాల‌జీ అండ్ బ‌యో టెక్నాల‌జీ
సీట్లు: 18
అర్హత‌: కెమిస్ట్రీ, బోట‌నీ, మైక్రో బ‌యాల‌జీ, జెనెటిక్స్‌, బ‌యో కెమిస్ట్రీ, బ‌యో టెక్నాల‌జీ వీటిలో ఏదైనా స‌బ్జెక్టుతో బీఎస్సీలో 60 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

కోర్సు: ఎమ్మెస్సీ మాలిక్యుల‌ర్ మైక్రో బ‌యాల‌జీ
సీట్లు: 12
అర్హత‌: జువాల‌జీ, జెనెటిక్స్‌, బ‌యోటెక్నాల‌జీ, బ‌యోకెమిస్ట్రీ, బోట‌నీ, మైక్రోబ‌యాల‌జీ, లైఫ్ సైన్సెస్ వీటిలో క‌నీసం ఏదో ఒక స‌బ్జెక్టుతో బీఎస్సీలో 60 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణత‌.

కోర్సు: ఎమ్మెస్సీ యానిమ‌ల్ బ‌యోటెక్నాల‌జీ
సీట్లు: 18
అర్హత‌: బీఎస్సీలో 60 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణత సాధించాలి. జువాల‌జీ, జెనెటిక్స్‌, బ‌యోటెక్నాల‌జీ, బ‌యోకెమిస్ట్రీ, బోట‌నీ, మైక్రోబ‌యాల‌జీ, లైఫ్ సైన్సెస్‌లో వీటిలో క‌నీసం ఒక స‌బ్జెక్టు చ‌దివుండాలి.

కోర్సు: ఎమ్మెస్సీ బ‌యోటెక్నాల‌జీ
సీట్లు: 25
అర్హ‌త‌: ఫిజిక‌ల్‌, బ‌య‌లాజిక‌ల్‌, అగ్రిక‌ల్చర‌ల్‌, వెట‌ర్నరీ, ఫిష‌రీ సైన్సెస్‌, ఫార్మసీ, ఇంజినీరింగ్‌, బీఎస్సీ ఫిజిక‌ల్ అసిస్టెంట్ కోర్సు, ఎంబీబీఎస్, బీడీఎస్ వీటిలో ఏదైనా డిగ్రీలో 55 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణత సాధించిన‌వారు అర్హులు.
ప్రవేశం: జేఎన్‌యూ, న్యూఢిల్లీ నిర్వహించే ఉమ్మడి ప్రవేశ ప‌రీక్ష ద్వారా ప్రవేశం ల‌భిస్తుంది.

కోర్సు: హెల్త్ సైకాల‌జీ
మొత్తం సీట్లు: 12
అర్హత‌: సైకాల‌జీ ఒక స‌బ్జెక్టుగా 60 శాతం మార్కుల‌తో మూడేళ్ల డిగ్రీ ఉత్తీర్ణత‌

కోర్సు: ఓషియ‌న్ అట్మాస్ఫెరిక్ సైన్సెస్‌
సీట్లు: 15 (వీటిలో 5 స్పాన్సర్డ్‌)
అర్హత‌: 55 శాతం మార్కుల‌తో మ‌్యాథ్స్‌, ఫిజిక్స్ త‌ప్పనిస‌రి స‌బ్జెక్టులుగా బీఎస్సీ లేదా సివిల్‌, మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్ బ్రాంచ్‌ల్లో ఇంజినీరింగ్ ఉత్తీర్ణత‌

కోర్సు: మాస్టర్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్‌
సీట్లు: 40 (వీటిలో 10 స్పాన్సర్డ్‌)
అర్హత‌: మెడిసిన్‌, డెంటిస్ట్రీ, ఆయుర్వేదిక్ మెడిసిన్‌, హోమియోప‌తి, ఫిజియోథెర‌పీ, ఆక్యుపేష‌న‌ల్‌ థెర‌పీ, న‌ర్సింగ్‌, న్యూట్రిష‌న్‌, వెట‌ర్నరీ సైన్సెస్‌, అగ్రిక‌ల్చర‌ల్ సైన్సెస్‌, ఫార్మకాల‌జీ, సోష‌ల్ సైన్సెస్ లేదా ఇత‌ర ఏదైనా సైన్స్ కోర్సులు పూర్తిచేసిన‌వారు అర్హులు.

కోర్సు: ఎంసీఏ
సీట్లు: 60
అర్హత‌: 60 శాతం మార్కుల‌తో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. అయితే ఇంట‌ర్‌లో మ్యాథ్స్ త‌ప్పనిస‌రిగా చ‌దివుండాలి

రెండేళ్ల పీజీ ఆర్ట్స్ కోర్సులు
ఎంఏ ఇంగ్లిష్‌లో 45, ఫిలాస‌ఫీ 23, హిందీ 38, తెలుగు 45, ఉర్దూ 25, అప్లయిడ్ లింగ్విస్టిక్స్ 23, కంపారిటివ్ లిట‌రేచ‌ర్ 15, ఎక‌నామిక్స్ 60, హిస్టరీ 52, పొలిటిక‌ల్ సైన్స్ 52, సోషియాల‌జీ 52, ఆంత్రోపాల‌జీలో 30, క‌మ్యూనికేష‌న్‌లో 40 సీట్లు ఉన్నాయి.

మాస్టర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ భ‌ర‌త‌నాట్యంలో 8, కూచిపూడిలో 8 సీట్లు ఉన్నాయి.
ఫైన్ ఆర్ట్స్‌కు సంబంధించి పెయింటింగ్‌లో 14, ప్రింట్ మేకింగ్ 8, స్కల్ప్‌చ‌ర్‌లో 8 సీట్లు ఉన్నాయి.
ఎంబీఏ హెల్త్‌కేర్ అండ్ హాస్పిట‌ల్ మేనేజ్‌మెంట్‌లో 20, ఎంబీఏలో 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

వీటితోపాటు ప‌లు విభాగాల్లో పీజీ డిప్లొమా, ఎంఫిల్‌, పీహెచ్‌డీ, ఎంటెక్ కోర్సులు కూడా హైద‌రాబాద్ కేంద్రీయ విద్యాల‌యం అందిస్తోంది.

అన్ని కోర్సుల‌కూ ప్రవేశం రాత ప‌రీక్ష ద్వారా ల‌భిస్తుంది. ఏ కోర్సుకైన‌ప్పటికీ వంద మార్కులకు ప్రశ్నప‌త్రం ఉంటుంది. అయితే మాస్టర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌, మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌, ఎంఏ క‌మ్యూనికేష‌న్‌, పీజీ డిప్లొమా ఇన్ హెల్త్ క‌మ్యూనికేష‌న్ కోర్సుల‌కు రాత‌ప‌రీక్షతో పాటు ప్రాక్టిక‌ల్ టెస్ట్‌/ ఇంట‌ర్వ్యూ ద్వారా ప్రవేశం ల‌భిస్తుంది. ఈ కోర్సుల‌న్నీ వ‌ర్సిటీలోని స‌రోజినీ నాయుడు స్కూల్ ప‌రిధిలోకి వ‌స్తాయి. రాత‌ప‌రీక్షలో అర్హత సాధించిన‌వారిని ప్రాక్టిక‌ల్ టెస్ట్‌/ ఇంట‌ర్వ్యూల‌కు హైద‌రాబాద్‌ పిలుస్తారు.
ఎమ్మెస్సీ ఓషియ‌న్ అండ్ అట్మాస్ఫియ‌రిక్ సైన్సెస్‌, ఎంబీఏ హెల్త్ కేర్ అండ్ హాస్పిట‌ల్ మేనేజ్‌మెంట్‌, ఎమ్మెస్సీ హెల్త్ సైకాల‌జీ (రెండేళ్ల కోర్సు), ఎంఫిల్‌, ఇంటిగ్రేటెడ్ ఎంఫిల్‌/ పీహెచ్‌డీ, కాగ్నిటివ్ సైన్స్‌, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ పీహెచ్‌డీ, బ‌యోటెక్నాల‌జీ, ఎంటెక్ మెటీరియ‌ల్ ఇంజినీరింగ్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి రాత‌ప‌రీక్షతోపాటు ఇంట‌ర్వ్యూ కూడా నిర్వహిస్తారు. రాత ప‌రీక్షకు 75, ఇంట‌ర్వ్యూకు 25 మార్కులు కేటాయించారు.
ఎంబీఏ కోర్సుకు క్యాట్ స్కోర్ ఆధారంగా ఇంట‌ర్వ్యూ నిర్వహించి ప్రవేశం క‌ల్పిస్తారు.
ఎంటెక్ కంప్యూట‌ర్ సైన్స్‌, ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్‌, ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ, ఐసీ టెక్నాల‌జీ, బ‌యో ఇన్ఫర్మాటిక్స్ కోర్సుల‌కు గేట్ స్కోర్ ఆధారంగా ప్రవేశం ల‌భిస్తుంది.
ఇంటిగ్రేటెడ్ బీటెక్‌, ఎంటెక్ (సీఎస్‌) కోర్సులో ప్రవేశం జేఈఈ మెయిన్ ప‌రీక్షలో సాధించిన స్కోర్‌తో క‌ల్పిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రాలు హైద‌రాబాద్‌, క‌డ‌ప‌, క‌రీంన‌గ‌ర్‌, నిజామాబాద్‌, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం, వ‌రంగ‌ల్‌ల్లో ఉన్నాయి.

వెబ్‌సైట్‌: http://www.uohyd.ac.in/

అప్లై ఆన్‌లైన్: http://hcuent.sifyitest.com/uoh_instructions.php