• facebook
  • whatsapp
  • telegram

11 నుంచి టీఎస్‌ఈసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: టీఎస్‌ఈసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ జులై 11వ తేదీ నుంచి మొదలు కానుంది. మొదటి విడతలో సీటు రాని అభ్యర్థులు 11న ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలి. 12న ధ్రువపత్రాల పరిశీలన, 13 వరకు ఆప్షన్ల ఎంపికకు అవకాశం ఉంది. 15న సీట్ల కేటాయింపు పూర్తవగానే, 17 లోపు ట్యూషన్‌ ఫీజు చెల్లించి, రిపోర్టు చేయాలి. కౌన్సెలింగ్‌కు సంబంధించిన ఇతర వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ తెలిపారు.

  • Tags