• facebook
  • whatsapp
  • telegram

ఎస్సీల ఉపకార వేతనాల్లో కేంద్రం వాటా పెంపు!

దిల్లీ: షెడ్యూల్డు కులాల(ఎస్సీ) విద్యార్థుల ఉపకార వేతనాల్లో సరికొత్త నిధుల వాటా విధానాన్ని అమలు చేయాలనే దిశగా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ యోచిస్తోంది. ఈ ఉపకార వేతనాల పథకంలో సింహభాగం ఆర్థిక భారాన్ని కేంద్రం భరించనుంది. ఈ మేరకు జులై 7న‌ తాజా ప్రతిపాదనను ఆర్థిక వ్యవహారాలపై మంత్రివర్గ కమిటీకి సమర్పించారు. ఈ ప్రతిపాదన ప్రకారం ఎస్సీ విద్యార్థుల పోస్ట్‌మెట్రిక్‌ ఉపకార వేతనాల పథకంలో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రాలు భరిస్తాయి.

  • Tags