• facebook
  • whatsapp
  • telegram

ఐఐఎం కోజికోడ్‌లో ఏడాది ఎంబీయే

కోజికోడ్‌: కార్పొరేట్‌ సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఐఐఎం కోజికోడ్‌ ఏడాది ఎంబీయేకోర్సును ప్రవేశపెట్టింది. ఇప్పటికే వ్యాపారరంగంలో ఉండి, సరికొత్త నైపుణ్యాలను అలవర్చుకోవాలనుకునే వారికోసం ఈ కోర్సు రూపొందించారు. ఏడాదిపాటు ఐఐఎం వసతి గృహంలోనే ఉండి ఈ కోర్సు పూర్తిచేయాల్సి ఉంటుంది. దీనివల్ల పెద్దపెద్ద కార్పొరేట్‌ సంస్థలలో ఉన్నతోద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని ఐఐఎం కోజికోడ్‌ సంచాలకుడు ప్రొఫెసర్‌ దేబాశీష్‌ ఛటర్జీ వివరించారు. ఇప్పటికే అనుభవం ఉన్నవారిని మరింత సామర్థ్యం గలవారిగా తీర్చిదిద్దడానికే ఈ కోర్సును రూపొందించామని ఆయన చెప్పారు. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచి, వారే ఉన్నత నాయకత్వ స్థానాలు చేపట్టేలా చూడాలని పలు కార్పొరేట్‌ సంస్థలు భావిస్తున్నాయి.

  • Tags