• facebook
  • whatsapp
  • telegram

జవాబుపత్రాలు చూసుకుంది నాలుగో వంతు విద్యార్థులే!

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌లో తప్పిన విద్యార్థుల జవాబుపత్రాలను స్కాన్‌ చేసి వెబ్‌సైట్లో ఉంచి నెల రోజులు దాటినా..కేవలం నాలుగో వంతు విద్యార్థులే వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవడం గమనార్హం. తప్పినవారికి చెందిన 9.22 లక్షల పత్రాలు, ఉత్తీర్ణులైనా మార్కులు పెరుగుతాయన్న విశ్వాసంతో పునఃపరిశీలనకు దరఖాస్తు చేసినవారివి మరో 68 వేలు కలిపి..మొత్తం 9.90 లక్షల వరకు జవాబుపత్రాలను జూన్‌ మొదటివారంలో ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్లో ఉంచింది. వాటిని హాల్‌టికెట్‌ సంఖ్య ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉన్నా, నెల గడిచినా ఇప్పటిదాకా 2,39,375 జవాబుపత్రాలను మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అది 24.17 శాతంతో సమానం. అంటే నాలుగో వంతు అభ్యర్థులే చూసుకున్నట్లయింది. పెరిగేందుకు అవకాశం ఉంటేనే వాటిని డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
 

  • Tags