• facebook
  • whatsapp
  • telegram

అన్నింటికీ.. నీట్, నెక్స్ట్‌!

* ఎయిమ్స్‌ సహా అన్ని జాతీయ వైద్య విద్యాసంస్థలకూ వర్తింపు 
* నెక్స్ట్‌ ద్వారా పీజీ మెడికల్‌ ప్రవేశాలు 
* కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు 

ఈనాడు, దిల్లీ: దేశంలో వైద్య విద్య పర్యవేక్షణ కోసం ‘జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ)' పేరుతో స్వయంప్రతిపత్తి సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ‘ఎన్‌ఎంసీ-2019 బిల్లు'కు జులై 17న‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుత సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతారు.

  • Tags