• facebook
  • whatsapp
  • telegram

హిందీలో వైద్య, ఇంజినీరింగ్‌ విద్య అందించాలి

ఈనాడు, దిల్లీ: వైద్య, ఇంజినీరింగ్‌ కోర్సులను హిందీ మాధ్యమంలో అందించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆర్‌ఎస్‌ఎస్‌ సూచించింది. ప్రస్తుతం ఈ కోర్సులు ఆంగ్లంలోనే చదివేందుకు అవకాశం ఉంది. అదనపు మాధ్యమంగా హిందీ ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్‌ భావిస్తోంది. ఆంగ్లంలో ప్రావీణ్యం లేక చాలామంది ఈ కోర్సులు చదవలేకపోతున్నారని, మరికొందరయితే ఆంగ్లం రాదన్న న్యూనతతో వీటికి దూరమవుతున్నారని తెలిపింది. ఈ మేరకు ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ అయిన సంస్కృతి భారతి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌కు లేఖ పంపించింది.

  • Tags