• facebook
  • whatsapp
  • telegram

బీహెచ్‌ఎంఎస్‌ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌

ఈనాడు డిజిటల్, హైదరాబాద్‌: తెలంగాణలోని ప్రైవేటు హోమియో కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ కోటాలో సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బీహెచ్‌ఎంఎస్‌ బీ, సీ కోటా సీట్ల భర్తీకి తుది మెరిట్‌ జాబితాలో అర్హులైన అభ్యర్థులకు సెప్టెంబరు 26న ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది. ఇందుకోసం అభ్యర్థులు హైదరాబాద్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్‌ జి.రాంరెడ్డి దూరవిద్య కేంద్రంలో హాజరుకావాలని సూచించింది. విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల్లో కాంపిటెంట్‌ అథారిటీ కోటాలో ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ, ఎండీ హోమియోపతి, యునానీ, ఆయుర్వేద కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు 24వ తేదీ నుంచి 30వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లలో సంప్రదించాలని పేర్కొంది.

  • Tags