• facebook
  • whatsapp
  • telegram

కౌశల్ ‌- 2019 మీరే కావొచ్చు..!

* అక్టోబరు 31వరకు అవకాశం
అనంతపురం విద్య, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహాలు అందిస్తున్నారు. రాష్ట్రస్థాయి సైన్స్‌ ప్రతిభాన్వేషణ పోటీ కౌశల్‌-2019లోప్రతిభ చాటిన విద్యార్థులకు రూ.2వేల నుంచి రూ.10వేల వరకు బహుమతులు అందుకోవచ్చు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను డీఈఓ శామ్యూల్, జిల్లా సైన్సు అధికారి వెంకట రంగయ్య, ఎస్‌ఎస్‌ఏ విద్యాపర్యవేక్షక అధికారులు జయచంద్ర, ఆనందభాస్కర్‌రెడ్డిల బృందం వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని 8, 9, 10వతరగతుల్లోని విద్యార్థులు కౌశల్‌ అవార్డును అందుకోవడానికి అవకాశం దక్కుతుంది. భారతీయ విజ్ఞాన మండలి (బీవీఎమ్‌), ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి (ఆప్‌కాస్ట్‌) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.


కౌశల్‌ క్విజ్‌...
కౌశల్‌ క్విజ్‌టీంలో ముగ్గురు విద్యార్థులు ఉండాలి. 8, 9, 10తరగతుల విద్యార్థులు పాల్గొనాలి. ఈ తరగతుల్లోని గణితము, సైన్స్, విజ్ఞానభారతి వారి ‘విజ్ఞానశాస్త్ర రంగంలో భారతీయ శాస్త్రవేత్తల కృషి’ మెటీరియల్‌ను సిలబస్‌గా పరిగణనలోకి తీసుకుంటారు. జిల్లాస్థాయిలో ప్రథమ రూ.5వేలు, ద్వితీయ రూ.3వేలు, తృతీయ రూ.2వేలు, రాష్ట్రస్థాయిలో ప్రథమ రూ.10వేలు, ద్వితీయ రూ.7,500, తృతీయ రూ.5వేలు సర్టిఫికెట్‌ అందజేస్తారు.


పోస్టర్‌ ప్రజెంటేషన్‌...
8,9 తరగతుల్లోని విద్యార్థులు. స్వచ్ఛభారత్, జలసంరక్షణ, జీవవైవిద్య పరిరక్షణ, వాతావరణ మార్పులు, ప్రకృతి వ్యవసాయం, ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం ఏదో ఒక అంశంపై పోస్టర్‌ ప్రజెంటేషన్‌ చేయవచ్చు.జిల్లాస్థాయిలో ప్రథమ రూ.3వేలు, ద్వితీయ రూ.2వేలు, తృతీయ రూ.1000నగదు బహుమతి, రాష్ట్రస్థాయిలో ప్రథమ రూ.5వేలు, ద్వితీయ రూ.3వేలు, తృతీయ రూ.2వేల నగదు బహుమతి పొందవచ్చు.
* అక్టోబరు 31వతేదీలోగా పేర్లు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.
* పాఠశాల సమన్వయకర్తలు విద్యార్థుల వివరాలను http://bvmap.org/ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి.
* జిల్లా స్థాయి పోటీలు నవంబరు 30, రాష్ట్రస్థాయి పోటీలు డిసెంబరు 14వతేదీన ఉంటాయి.

  • Tags