• facebook
  • whatsapp
  • telegram

అన్ని వర్సిటీల్లో రెక్టార్‌ల నియామకం!

* ఉన్నత విద్యామండలి అభిప్రాయాన్ని కోరిన విద్యాశాఖ

ఈనాడు, హైదరాబాద్‌: విద్యాశాఖ పరిధిలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో రెక్టార్‌లను నియమించాలని తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ పదవుల భర్తీపై అభిప్రాయం చెప్పాలని ఇటీవల తెలంగాణ‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలిని విద్యాశాఖ కోరింది. విద్యాశాఖ పరిధిలో 11 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. జేఎన్‌టీయూహెచ్‌, ఓయూ చట్టాలలోనే రెక్టార్‌ పదవి ప్రస్తావన ఉంది. ప్రస్తుతం ఒక్క జేఎన్‌టీయూహెచ్‌లో మాత్రమే ఆ పదవిని భర్తీ చేస్తున్నారు. ఓయూలో దశాబ్ద కాలానికిపైగా రెక్టార్‌ను నియమించడం లేదు. తాజాగా ప్రభుత్వం వీరి నియామకంపై ఆలోచన చేస్తోంది. తద్వారా విద్యాపరమైన వ్యవహారాలపై మరింతగా దృష్టి సారించాలని భావిస్తున్నట్లు సమాచారం. విశ్వవిద్యాలయాల చట్టంలో లేకున్నా.. ఆయా వర్సిటీలు పాలక మండలి(ఈసీ) ఆమోదం తీసుకొని రెక్టార్‌ను నియమించుకోవచ్చు.