• facebook
  • whatsapp
  • telegram

కొత్త కోర్సులపై ఏఐసీటీఈ ఆన్‌లైన్‌ శిక్షణ


ఈనాడు, అమరావతి: వృత్తి విద్యా సంస్థల అధ్యాపకులు, పరిశోధకులు, పీజీ చేసేవారికి కొత్త కోర్సులపై అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) ఆన్‌లైన్‌ శిక్షణ అందిస్తోంది. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, కృత్రిమ మేధస్సు, బ్లాక్‌చైన్, సైబర్‌ సెక్యూరిటీ, డాటా సైన్సు, అగ్‌మెంటెడ్‌ రియాల్టీ(ఏఆర్‌)/ వర్చువల్‌ రియాల్టీ(వీఆర్‌), రొబోటిక్స్‌ క్వాంటం కంప్యూటింగ్, త్రిడీ ప్రింటింగ్, డిజైన్‌ కోర్సులపై ఈ శిక్షణ అందించనుంది. ఆన్‌లైన్‌ శిక్షణ అందించే బాధ్యతలను జాతీయ, రాష్ట్ర సాంకేతిక విద్యా సంస్థలకు అప్పగించింది. బ్లాక్‌చైన్‌ కోర్సుపై శిక్షణ ఇచ్చేందుకు జేఎన్‌టీయూ పులివెందుల కళాశాల ఎంపికైంది. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం ప్రారంభమయ్యాయి. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న అధ్యాపకులకు వీడియో లింకును పంపిస్తారు.

  • Tags