• facebook
  • whatsapp
  • telegram

ఎంసెట్‌ హాల్‌టికెట్ల జారీకి సమయం కోరిన టీసీఎస్‌

ఈనాడు, అమరావతి: ఏపీ ఎంసెట్‌ పరీక్షా కేంద్రాల సామర్థ్య పరిశీలన, హాల్‌టికెట్ల జారీకి లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత రెండు వారాల సమయం కావాలని ఉన్నత విద్యామండలిని టీసీఎస్‌ సంస్థ కోరింది. కంప్యూటర్‌ ఆధారిత ఎంసెట్‌ పరీక్షను టీసీఎస్‌ నిర్వహిస్తోంది. లాక్‌డౌన్‌ సడలించిన అనంతరం పరీక్షా కేంద్రాల్లోని కంప్యూటర్ల సామర్థ్యం, వాటి పని తీరును పరిశీలించేందుకు రెండు వారాల సమయం పడుతుందని, ఇది పూర్తయిన తర్వాత హాల్‌టికెట్ల జారీ చేపడతామని పేర్కొంది. హాల్‌టికెట్లను విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు మరో వారం రోజులు సమయం ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత ఎంసెట్‌ పరీక్ష నిర్వహణకు మూడువారాల సమయం పట్టనుంది.

  • Tags