• facebook
  • whatsapp
  • telegram

వచ్చే ఏడాది ఆన్‌లైన్‌లో 5 డిగ్రీ సబ్జెక్టుల బోధన


ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే విద్యా సంవత్సరం (2020-21)లో రాష్ట్రంలో అయిదు డిగ్రీ సబ్జెక్టులను ఆన్‌లైన్‌లో అందిస్తామని రాష్ట్ర సాంకేతిక, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ వెల్లడించారు. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌ విద్యపై ఓ డిజిటల్‌ లెర్నింగ్‌ మేగజైన్ ఏప్రిల్ 8న‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన తన ఇంటి నుంచి వెబినార్‌ ద్వారా మాట్లాడారు. రాష్ట్రంలో విద్యార్థుల కోసం ఆన్‌లైన్‌ బోధనను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ఇప్పటికే ఆన్‌లైన్‌ మూల్యాంకనం అమలు చేస్తున్నామని, ఓయూలో సైతం అమలవుతోందని చెప్పారు. కార్యక్రమంలో దాదాపు 200 మంది అధ్యాపకులు, నిపుణులు వెబినార్‌ ద్వారా పాల్గొన్నారు.

  • Tags