• facebook
  • whatsapp
  • telegram

ఏప్రిల్‌ 20 నుంచి ఆన్‌లైన్‌లో జీమ్యాట్‌

దిల్లీ: ప్రపంచంలోని వివిధ బిజినెస్‌ స్కూళ్లలో ప్రవేశానికి ఉద్దేశించిన జీమ్యాట్‌ పరీక్షను ఆన్‌లైన్‌లో ఏప్రిల్‌ 20 నుంచి నిర్వహించనున్నారు. గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ కౌన్సిల్‌(జీఎంఏసీ) ఆధ్వర్యంలో జరిగే ఈ అర్హత పరీక్ష ద్వారా దాదాపు 2000 బిజినెస్‌ స్కూళ్లలో ప్రవేశం పొందేందుకు వీలుంటుంది. గత ఏడాది 114 దేశాల పరిధిలోని 650 కేంద్రాల్లో 2లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.

  • Tags