• facebook
  • whatsapp
  • telegram

ఏప్రిల్ 16 నుంచి రేడియోలో ఎంసెట్‌ పాఠాలు

ఈనాడు డిజిటల్, అమరావతి: లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన గురుకులాల్లోని ఇంటర్‌ విద్యార్థులకు ఏప్రిల్ 16 నుంచి ఆకాశవాణి (రేడియో) ద్వారా ఎంసెట్‌ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపె విశ్వరూప్‌ తెలిపారు. రోజూ ఉదయం 10:30 నుంచి 11:00 గంటల వరకు విద్యార్థులు తరగతులు వినొచ్చని ఏప్రిల్ 15న‌ వెల్లడించారు. రేడియో సెట్‌ అందుబాటులో లేని విద్యార్థులు స్మార్ట్‌ఫోన్‌లో ఆల్‌ ఇండియా రేడియో(ఏఐఆర్‌) యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, అందులో తెలుగు భాషను ఎంపిక చేసుకుని ఎయిర్‌ విజయవాడ ద్వారా తరగతులు వినొచ్చని వివరించారు.

  • Tags