• facebook
  • whatsapp
  • telegram

ఉన్నత విద్యలో ఆన్‌లైన్‌ ప్రవేశాలు


ఈనాడు, అమరావతి: విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆన్‌లైన్‌లోనే ప్రవేశాలు నిర్వహించనున్నారు. ఉన్నత విద్యలో సాంకేతిక సంస్కరణల్లో భాగంగా ఆ శాఖ ఏప్రిల్ 16న‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థి రిజిస్ట్రేషన్‌, కౌన్సెలింగ్‌, సీట్ల కేటాయింపు, ప్రవేశాలను ఆన్‌లైన్‌ చేయనుంది. వర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో అకడమిక్‌, పరిపాలన కార్యకలాపాలను సైతం ఆటోమేషన్‌ చేయనున్నారు. ఏపీ సమగ్ర ఆర్థిక సేవల విధానం(ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌) సాంకేతిక సహాయం అందిస్తుంది.
* యూజీ, పీజీ, పీహెచ్‌డీ, పోస్ట్‌ డాక్టోరల్‌ సహా సెమిస్టర్‌ పరీక్ష దరఖాస్తు విధానం, రుసుముల చెల్లింపు, హాల్‌టికెట్ల జారీ, పరీక్ష హాజరు పర్యవేక్షణ, జవాబు పత్రాల కోడింగ్‌, డీకోడింగ్‌, ఫలితాల నమోదును ఆన్‌లైన్‌ చేయనున్నారు.
* కళాశాలలు, కోర్సుల అనుబంధ గుర్తింపును ఆన్‌లైన్‌ చేస్తారు. బోగస్‌ ప్రవేశాలను నివారించేందుకు దీన్ని తీసుకొస్తున్నారు.
* విద్యార్థులు, సిబ్బంది, ప్రవేశాలు, అకడమిక్‌ వివరాలతో రియల్‌టైం డ్యాష్‌బోర్డును ఏర్పాటు చేస్తారు.
* వర్సిటీలు, కళాశాలల్లో నిర్వహించే పనులను ఇక నుంచి ఈ-ఎంబుక్‌లో నమోదు చేయాలి.
* మానవవనరుల నిర్వహణ వ్యవస్థను ఆన్‌లైన్‌ చేస్తారు. సిబ్బంది హాజరు, ఉద్యోగుల రికార్డులను కంప్యూటరీకరిస్తారు.
* ఉన్నత విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర పరిపాలన, అకడమిక్‌ సంస్కరణల అమలును పర్యవేక్షిస్తారు.
* విశ్వవిద్యాలయాలతో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ సమన్వయం చేస్తారు. డిగ్రీ కళాశాలల్లో సాంకేతికత అమలు ప్రక్రియలో కళాశాల విద్య ప్రత్యేక కమిషనర్‌ సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.

  • Tags