• facebook
  • whatsapp
  • telegram

విద్యార్థులు, అధ్యాపకులకు ఆన్‌లైన్‌ వివరాలు

ఈనాడు, అమరావతి: విద్యార్థులు, అధ్యాపకుల కోసం అఖిల భారతీయ సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) ఆన్‌లైన్‌ సమాచారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. స్వీయ‌ ఆన్‌లైన్‌ కోర్సులు, జాతీయ డిజిటల్‌ గ్రంథాలయం, వర్చువల్‌ ల్యాబ్స్, టీసీఎస్‌ ఐయాన్‌ డిజిటల్‌ తరగతి గది, నైపుణ్యాలు పెంచుకునేందుకు ఉన్న వెబ్‌సైట్ల వివరాలను ఇందులో పొందుపర్చింది. జాతీయస్థాయిలో అందుబాటులో ఉన్న దాదాపు అన్ని వెబ్‌సైట్లను ఒక చోటకు చేర్చి వెబ్‌సైట్‌లో విద్యార్థులు, అధ్యాపకులకు అందుబాటులో ఉంచింది.


పదో తరగతి విద్యార్థులకు ఈ-పాఠ్యాంశాలు
పదో తరగతి విద్యార్థుల కోసం పాఠశాల విద్యాశాఖ ఈ-పాఠ్యాంశాలను సిద్ధం చేసింది. పీడీఎఫ్‌ రూపంలో పాఠాలవారీగా దీన్ని సిద్ధం చేశారు. వీటిని పిల్లల తల్లిదండ్రుల వాట్సాప్‌/మెయిల్‌కు పంపుతారు. విద్యార్థులు ఏదైనా సబ్జెక్టుకు సంబంధించిన పాఠంపై క్లిక్‌ చేస్తే దానికి సంబంధించిన వీడియోలు ప్రత్యక్షమవుతాయి. బోధనతోపాటు ఆయా పాఠాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు సమాధానాలు వీడియో రూపంలో వస్తాయి. క్యూఆర్‌ కోడ్‌ పుస్తకాల కోసం రూపొందించిన వీడియోలను పాఠ్యాంశాలతో జతచేసి వీటిని రూపొందించారు. పదో తరగతి పరీక్షలు వాయిదా పడినందున విద్యార్థులు స్వతహాగా చదువుకునేందుకు ఈ-కంటెంట్‌ను తీసుకొచ్చారు.

  • Tags