• facebook
  • whatsapp
  • telegram

ఏప్రిల్ 24 నుంచి ఇంటర్‌ మూల్యాంకనం

 

ఈనాడు, అమరావతి: ఇంటర్‌ ప్రశ్నపత్రాల మూల్యాంకనాన్ని ఏప్రిల్ 24 నుంచి ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అదనంగా 26 కేంద్రాలు ఏర్పాటుచేస్తారు. కరోనా ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో మూల్యాంకన కేంద్రాలను పట్టణాలకు చివరలో ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఇంటర్‌ రెండో ఏడాది పత్రాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మే నెలాఖరుకు ఫలితాలు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలో జాప్యం జరిగితే విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని ఇంటర్‌ విద్యామండలి నిర్ణయించింది.

  • Tags