• facebook
  • whatsapp
  • telegram

పీజీ వైద్య ప్రవేశాలకు 5 నుంచి వెబ్‌ ఆప్షన్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లో కన్వీనర్‌ కోటాలోని పీజీ వైద్యవిద్య తొలివిడత సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మే 4న ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు మే 5న ఉదయం 8 నుంచి 7న మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆన్‌లైన్‌లో వెబ్‌ఆప్షన్లను నమోదు చేసుకోవాలంది. ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తికాగా, నీట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారిలో తుది అర్హుల జాబితాను విడుదల చేసింది. అభ్యర్థులు కళాశాల, కోర్సుల వారీగా ప్రాధాన్య క్రమంలో వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని తెలిపింది.

  • Tags