• facebook
  • whatsapp
  • telegram

జేఈఈ మెయిన్స్‌ జులై 18 - 23 మధ్య

* ఆగస్టులో అడ్వాన్స్‌డ్‌.. జులై 26న నీట్‌
ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్స్‌, నీట్‌ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. జేఈఈ మెయిన్స్‌ జులై 18, 20, 21, 22, 23 తేదీల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ వెల్లడించారు. అడ్వాన్స్‌డ్‌ ఆగస్టులో ఉంటుందని తెలిపారు.  ఆ తేదీలను తర్వాత ప్రకటిస్తామన్నారు. నీట్‌ పరీక్ష జులై 26న ఉంటుందని చెప్పారు. మే 5న‌ కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమాల ద్వారా విద్యార్థులతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. నీట్‌కు 16.84 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని వార్షిక ఫీజులను పెంచొద్దని ఎన్‌ఐటీ, ఐఐటీలకు చెప్పామన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా సొంత ప్రాంతాలకు విద్యార్థులు వెళ్లిన కారణంగా జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌ పరీక్షా కేంద్రాలను మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ తెలిపింది.

  • Tags