• facebook
  • whatsapp
  • telegram

1-9 విద్యార్థులు పైతరగతులకు

ఈనాడు, హైదరాబాద్‌: పరీక్షలు నిర్వహించకుండానే రాష్ట్రంలో 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేస్తూ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ మే 5న‌ జీఓ జారీ చేశారు. కరోనా కారణంగా వీరికి పరీక్షలు(ఎస్‌ఏ-2) నిర్వహించలేదు. డిటెన్షన్‌ విధానం కూడా అమల్లో లేనందున వారిని వచ్చే విద్యాసంవత్సరం పైతరగతులకు పంపించాలని ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Tags