• facebook
  • whatsapp
  • telegram

మొదటి విడత ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌కు గడువు ఆగస్టు 15

* జూన్‌ 30లోపు వర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇవ్వాలి
* వచ్చే ఏడాదికి విద్యా కాలపట్టిక జారీ చేసిన ఏఐసీటీఈ

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే విద్యా సంవత్సరానికి(2020-21) బీటెక్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి మొదటి విడత కౌన్సెలింగ్‌ను ఆగస్టు 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. రెండో విడత కౌన్సెలింగ్‌ను ఆగస్టు 25వ తేదీకి పూర్తి చేసి మొత్తం ప్రవేశాల ప్రక్రియను నెలాఖరుకు ముగించాలని సూచించింది. సెప్టెంబరు 1వ తేదీ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభించాలని తెలిపింది. వృత్తి విద్యా కళాశాలలకు గతంలో జారీ చేసిన అనుమతుల నిబంధనావళి పత్రంలో మార్పులు చేస్తూ తాజాగా విద్యా సంవత్సరంపై కాలపట్టికను జారీ చేసింది. తాము జూన్‌ 15వ తేదీలోపు ఆయా కళాశాలలకు అనుమతులు ఇస్తామని, విశ్వవిద్యాలయాలు జూన్‌ 30వ తేదీలోపు అనుబంధ గుర్తింపు జారీ చేయాలని నిర్దేశించింది.
2020-21 విద్యా సంవత్సరం కాలపట్టిక ఇదీ...
* ఆగస్టు 1: పాత విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభం
* సెప్టెంబరు 1: కొత్త విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభం
* జులై 1 నుంచి: పీజీడీఎం/పీజీసీఎం తరగతులు మొదలు
* ఆగస్టు 15, 2021 లోపు: దూరవిద్యలో ప్రవేశాలు ముగియాలి

  • Tags