• facebook
  • whatsapp
  • telegram

లాక్‌డౌన్‌ ఎత్తేశాకే ‘పది’ పరీక్షలు

* మంత్రి ఆదిమూలపు సురేష్‌
ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేసిన తరువాతే రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు. ఒంగోలులోని ప్రకాశం భవన్‌లో మే 6న ఆయన విలేకరులతో మాట్లాడారు. పరీక్ష కేంద్రాల్లోనూ వ్యక్తిగత దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. పరీక్షల నిర్వహణపై వస్తున్న పుకార్లు నమ్మొద్దని కోరారు. అనంతరం లాక్‌డౌన్‌లో పారా పోలీసు విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్‌ చేసేలా ఆదేశాలివ్వాలని ప్యాఫ్టో ప్రతినిధులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఆయన స్పందిస్తూ... ఉపాధ్యాయులను రిలీవ్‌ చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు.

  • Tags