• facebook
  • whatsapp
  • telegram

ఎం‘సెట్‌ చేశారు’

* జులై 27 నుంచి.. ఈసెట్‌ 24న
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఏపీ ఎంసెట్‌ను జులై 27 నుంచి 31 వరకు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి కార్యదర్శి సుధీర్‌ ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. ఇంజినీరింగ్‌ రెండో ఏడాదిలోకి ప్రవేశానికి నిర్వహించే ఈసెట్‌ను జులై 24న నిర్వహించనున్నారు. అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు గడువు ఈనెల 20వరకు ఉంది. ఇప్పటి వరకు ఎంసెట్‌కు 2,48,614 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇంజినీరింగ్‌కు 1,69,137 మంది, వ్యవసాయ, వైద్య విద్యకు 78,959 మంది, రెండింటికీ 518 మంది దరఖాస్తు చేశారు. 3 వేల మంది రుసుము చెల్లించినా దరఖాస్తులు సమర్పించలేదు. ఇంజినీరింగ్‌ను ఎనిమిది విడతలుగా, వ్యవసాయ, వైద్య విద్య పరీక్షలను నాలుగు విడతలుగా నిర్వహించనున్నారు. ఉదయం, సాయంత్రం పరీక్షలు ఉంటాయి.

 

  • Tags