• facebook
  • whatsapp
  • telegram

పీజీ మెడికల్‌ మెరిట్‌ లిస్టు విడుదల

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: 2020-21 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్‌ (ఎండీ/ఎంఎస్‌), డెంటల్‌ (ఎండీఎస్‌) సీట్ల ప్రవేశాలకు సంబంధించి మెరిట్‌ లిస్టును మే 7న‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. పీజీ మెడికల్‌ విభాగంలో ఆల్‌ ఇండియా నీట్‌ ర్యాంక్‌ 1,620 సాధించిన ఎస్వీ యూనివర్సిటీ సర్వీస్‌ విద్యార్థి బాలాజీ కాకర్ల రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకులో నిలిచారు. సర్వీసు విద్యార్థి ప్రథమ స్థానం సాధించడం విశ్వవిద్యాలయ చరిత్రలో తొలిసారి. పీజీ డెంటల్‌లో ఆల్‌ ఇండియా నీట్‌ ర్యాంక్‌ 236 వచ్చిన ఎస్వీ యూనివర్సిటీ పరిధికి చెందిన బి.దినకర్‌రెడ్డికి మొదటి ర్యాంకు వచ్చింది. పీజీ మెడికల్‌ కోర్సులకు 3,886 దరఖాస్తులు రాగా 3,853 మంది, ఎండీఎస్‌కు 527 మంది దరఖాస్తు చేయగా 522 మంది అర్హత సాధించారు.
 

  • Tags