• facebook
  • whatsapp
  • telegram

తగినన్ని గదులుంటే.. ఆ కేంద్రంలోనే ‘పది’ పరీక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో వ్యక్తిగత దూరం పాటించినా.. అవసరమైన గదులు ఉంటే.. ఆ కేంద్రానికి కేటాయించిన మొత్తం విద్యార్థులకు అక్కడే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సత్యనారాయణరెడ్డి అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులను మే 7న‌ ఆదేశించారు. ఒకవేళ అదే ప్రాంగణంలో మరో ప్రాథమిక పాఠశాల ఉన్నా దాన్ని సైతం పరీక్షలకు వినియోగించుకోవచ్చని సూచించారు. ఆ విధంగా లేనిపక్షంలో పరీక్ష కేంద్రానికి సమీపంలోని మరో పాఠశాలను ఎంపిక చేసి అదనపు పరీక్షా కేంద్రంగా మార్చాలని ఆదేశించారు. అదనపు పరీక్షా కేంద్రాలకు అవసరమైన సిబ్బందిని కూడా ఎంపిక చేసి నివేదికను మే 8న‌ తమ కార్యాలయానికి పంపించాలని ఆయన ఆదేశించారు.
 

  • Tags