• facebook
  • whatsapp
  • telegram

పీజీ డెంటల్‌ మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య, దంత కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ కోటా పీజీ సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మే 8న‌నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నీట్‌-2020లో అర్హత సాధించిన అభ్యర్థులు మే 9 ఉదయం 11 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిర్దేశిత దరఖాస్తును పూర్తి చేయడంతోపాటు సంబంధిత ధ్రువపత్రాల్ని అప్‌లోడ్‌ చేయాలి. ఆన్‌లైన్‌లో దాఖలైన దరఖాస్తుల్ని, ధ్రువపత్రాల్ని పరిశీలించిన అనంతరం ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితాను విడుదల చేయనున్నారు. దరఖాస్తులకు సంబంధించి ఎదురయ్యే సాంకేతిక సమస్యల నివృత్తి కోసం 97040 93953, 84669 24522 నంబర్లలో సంప్రదించాలని విశ్వవిద్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.

  • Tags