• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌ మూల్యాంకనానికి సహకరిస్తాం

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ జవాబుపత్రాల మూల్యాంకనానికి సహకరిస్తామని కార్పొరేట్‌, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల యాజమాన్య సంఘాలు ఇంటర్‌బోర్డుకు హామీ ఇచ్చాయి. ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌ మే 8న‌ సంఘాల నేతలు గౌరి సతీష్‌, రాజవర్ధన్‌రెడ్డి తదితరులతో సమావేశం ఏర్పాటు చేశారు. మూల్యాంకనానికి అధ్యాపకులను పంపిస్తామని, హాస్టళ్లు, వాహనాలను సమకూర్చడానికి ప్రతినధులు అంగీకరించినట్లు జలీల్‌ తెలిపారు. ‘రోజుకు 45 జవాబుపత్రాలకు బదులు 30మాత్రమే ఇవ్వాలని, ఏ జిల్లాలోని కేంద్రంలోనైనా అధ్యాపకులు పాల్గొనేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వకళాశాలల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం ఒక ప్రకటనలో కోరింది.
 

  • Tags