• facebook
  • whatsapp
  • telegram

ఐఐఎం అహ్మదాబాద్‌లో హైదరాబాద్‌ విద్యార్థులకు చోటు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మక ఐఐఎం-అహ్మదాబాద్‌లో 2020-22 విద్యా సంవత్సరానికి పోస్టు గ్రాడ్యుయేట్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో నగరానికి చెందిన ఇద్దరు విద్యార్థులు సీట్లు సాధించారు. దిల్‌సుఖ్‌నగర్‌లో నివసిస్తున్న తిరుపతి కార్తీక్‌ 99.37 పర్సంటైల్‌ సాధించగా, వనస్థలిపురం ప్రశాంత్‌నగరంలో ఉంటున్న వరకాంతం హేమంత్‌రెడ్డి 99.13 శాతం పర్సంటైల్‌ దక్కించుకున్నాడు. కార్తీక్‌ సొంతూరు సూర్యాపేట కాగా తల్లిదండ్రులు నాగరాజు, ఉషశ్రీ ప్రభుత్వ ఉద్యోగులు. ఐఐటీ ధన్‌బాద్‌లో అతడు ఇంజినీరింగ్‌ డిగ్రీ పూర్తి చేశాడు. హేమంత్‌ స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దేవలమ్మ నాగారం. తండ్రి జంగారెడ్డి ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేస్తుంటారు. టీసీఎస్‌ కంపెనీలో హేమంత్‌ ఉద్యోగం చేస్తూనే క్యాట్‌ పరీక్ష రాసి ఉత్తీర్ణుయ్యాడు.

  • Tags