• facebook
  • whatsapp
  • telegram

ఎస్సీ గురుకులాల్లో జూన్‌ 12 నుంచి తరగతులు!

* టెలివిజన్‌ ద్వారా పాఠ్యాంశాల బోధనకు ఏర్పాట్లు
ఈనాడు డిజిటల్, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం తరగతుల్ని జూన్‌ 12 నుంచి ప్రారంభించేందుకు సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ సన్నాహాలు చేస్తోంది. కరోనా ప్రభావం మరికొన్ని నెలలు కొనసాగే అవకాశం ఉందని వైద్యనిపుణులు చెబుతుండటంతో విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా పాఠ్యాంశాలు బోధించేందుకు సొసైటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం దూరదర్శన్‌ లేదా ప్రైవేటు ఛానళ్ల ద్వారా రోజుకు కొన్ని గంటల చొప్పున పాఠ్యాంశాలు బోధిస్తే ఎంత వ్యయమవుతుందనే దానిపై సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుతం దూరదర్శన్‌ ద్వారా రోజుకు 2 గంటల చొప్పున తరగతులు బోధించేందుకు అవకాశముంది. మరింత ఎక్కువ సమయం కేటాయించాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

 

  • Tags