• facebook
  • whatsapp
  • telegram

నాటా-2 పరీక్షా వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశానికి మే 31వ తేదీన నిర్వహించ తలపెట్టిన నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు ఇన్‌ ఆర్కిటెక్చర్‌(నాటా)-2 పరీక్ష కూడా వాయిదా పడింది. మొదటి పరీక్ష ఏప్రిల్‌ 19వ తేదీన జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా వేశారు. తాజాగా రెండో పరీక్షనూ వాయిదా వేస్తున్నట్లు ఆర్కిటెక్చర్‌ కౌన్సిల్‌ ప్రకటించింది. సాధారణ పరిస్థితులు నెలకొన్న అనంతరం మొదటి, రెండు విడతల పరీక్షల తేదీలు, సమాచార పత్రాన్ని వెబ్‌సైట్లో ఉంచుతామని తెలిపింది.

  • Tags