• facebook
  • whatsapp
  • telegram

లాక్‌డౌన్‌లో నూటికి నూరుశాతం హాజరు

* పూర్తి సిలబస్‌తోనే ప్రశ్నపత్రం
* ఉస్మానియా వర్సిటీ నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ సమయంలో వర్సిటీ పరిధిలోని అన్ని కోర్సుల విద్యార్థులకు నూటికి నూరుశాతం హాజరు కలపాలని ఉస్మానియా వర్సిటీ నిర్ణయించింది. చివరి సంవత్సరం విద్యార్థులకు జూన్  మూడు లేదా నాలుగో వారంలో సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. పూర్తి సిలబస్‌తోనే ప్రశ్నపత్రం ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. వర్సిటీలోని కళాశాలల ప్రిన్సిపాళ్లు, డీన్లు, పరీక్షల నియంత్రణాధికారి, అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ అధికారులతో రిజిస్ట్రార్‌ ప్రొ.సీహెచ్‌ గోపాల్‌రెడ్డి  మే 9న  చర్చించారు. యూజీసీ మార్గదర్శకాల మేరకు సెమిస్టర్‌ పరీక్షల సమయాన్ని మూడు గంటల నుంచి రెండు గంటలకు కుదించనున్నారు.
*  ప్రశ్నపత్రంలో ఎక్కువ ఛాయిస్‌లు ఇవ్వనున్నారు. పూర్తి సిలబస్‌ నుంచే ప్రశ్నలు ఇవ్వాలనే అభిప్రాయాన్ని ఆచార్యులు వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంపై విద్యార్థి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
*  ఈ నెల 16 లేదా 18న స్టాండింగ్‌ కమిటీ సమావేశం నిర్వహిస్తారు. సెమిస్టర్‌ పరీక్షలకు నోటిఫికేషన్‌ ఇచ్చే విషయం అదే రోజు తేలనుంది.
*  వర్సిటీ, కళాశాలల్లోని పరిపాలన విభాగంలో కార్యకలాపాలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి.

  • Tags