• facebook
  • whatsapp
  • telegram

పరీక్షకు ఎలా వెళ్లేది?

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలకు హాజరుపై ఏపీ విద్యార్థుల ఆందోళన
విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: లాక్‌డౌన్‌ కారణంగా తెలంగాణలో నిలిచిన ఇంటర్మీడియట్‌ భూగోళశాస్త్రం, మోడల్‌ లాంగ్వేజెస్‌ పరీక్షలను మే 18న నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్‌ ప్రకటించింది. హైదరాబాద్‌లో చదువుకుంటున్న ఏపీ విద్యార్థులు లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎలాగోలా తమ స్వగృహాలకు చేరుకున్నారు. పరీక్ష రాసేందుకు వారు ఇప్పుడు హైదరాబాద్‌కు ఎలా వెళ్లాలనే ఆందోళన మొదలైంది. ప్రజారవాణా వ్యవస్థ పున:ప్రారంభం కాకముందే పరీక్షల తేదీని ప్రకటించడం వారిని అయోమయానికి గురి చేస్తోంది. మార్చి 23న జరగాల్సిన పరీక్షలను లాక్‌డౌన్‌ కారణంగా వెంటనే వాయిదా వేశారు. అందుబాటులో ఉన్న రవాణా వ్యవస్థ ద్వారా ఏపీ విద్యార్థులు మరుసటి రోజే స్వగ్రామాలకు చేరుకున్నారు. ఐఏఎస్‌ సాధన లక్ష్యంగా బోధించే ఇంటర్‌, డిగ్రీ అయిదేళ్ల సమీకృత కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ప్రధానంగా ఈ సమస్య ఎదురైంది. పరీక్ష సమయంలో వసతిగృహం కూడా ఉండదని, ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.

  • Tags