• facebook
  • whatsapp
  • telegram

45 జవాబుపత్రాలు దిద్దేదెలా?

* ఇంటర్‌ మూల్యాంకనంపై అధ్యాపకుల్లో ఆందోళన
ఈనాడు, హైదరాబాద్‌: రోజుకు 45 ఇంటర్‌ జవాబుపత్రాలను సక్రమంగా మూల్యాంకనం చేయడం సాధ్యమేనా అని కొందరు అధ్యాపకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇంటర్‌ మూల్యాంకనం రాష్ట్రవ్యాప్తంగా మే 12 నుంచి ప్రారంభం కానుంది. సాధారణంగా గతంలో ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదింటి వరకు మూల్యాంకనం సాగేది. నిబంధనల ప్రకారం రోజుకు 30 జవాబుపత్రాలను ఇచ్చేవారు. ఇప్పుడు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు... అంటే రెండు గంటలు పెంచి మొత్తం 45 జవాబుపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో ఏప్రిల్‌లో మూల్యాంకనం పూర్తయ్యేది. ఇప్పుడు అత్యధిక ఉష్ణోగత్రలు ఉండే మే నెల వచ్చింది. ఇప్పుడు 45 పేపర్లు అంటే విద్యార్థులకు న్యాయం చేయలేమని ఒక అధ్యాపకుడు ఆవేదన వ్యక్తం చేశారు.

  • Tags