• facebook
  • whatsapp
  • telegram

పెరిగిన మెడికల్‌ పీజీ సీట్లు

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: వచ్చే విద్యా సంవత్సరానికి (2020-21) రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో పీజీ మెడికల్‌ సీట్లు పెరిగాయి. గతేడాది ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 889 సీట్లకుతోడు ఈ ఏడాది 54 పెరిగి మొత్తం 943 సీట్లకు అనుమతులు వచ్చాయి. వీటిలో నేషనల్‌ పూల్‌కి 50 శాతం అందుబాటులో ఉంచుతారు. ప్రైవేటు వైద్య కళాశాలలో గతేడాది 1068 సీట్లు భర్తీ చేస్తే ఈ సారి మరో 133 సీట్లు పెరిగి 1201కు చేరాయి. కన్వీనర్‌ కోటాలో యూనివర్సిటీల ప్రాతిపదికన క్లినికల్‌ విభాగాలకు సంబంధించి ఏయూ 360, ఎస్వీయూ 304, రాష్ట్రవ్యాప్త సిద్ధార్థ వైద్య కళాశాలలో 64 సీట్లు అందుబాటులో ఉన్నాయి. నాన్‌ క్లినికల్‌ విభాగంలో ఏయూ 122, ఎస్వీయూ 68, రాష్ట్రవ్యాప్తంగా 25 సీట్లున్నాయి. మేనేజ్‌మెంట్‌ కోటా (ప్రైవేటు) క్లినికల్‌ విభాగంలో ఏయూ పరిధిలో 720, ఎస్వీయూలో 270, నాన్‌ క్లినికల్‌ విభాగంలో ఏయూ 138, ఎస్వీయూ పరిధిలో 73 సీట్లకు అనుమతులు వచ్చాయి. ఈ ఏడాది గుంటూరు మెడికల్‌ కళాశాలలో అదనంగా 32, కర్నూలు విశ్వభారతి వైద్య కళాశాలలో 42 సీట్లకు అనుమతులు వచ్చాయి.

  • Tags