• facebook
  • whatsapp
  • telegram

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ మరింత చేరువ

* ఇంకొన్ని పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు
* తెలుగు రాష్ట్రాల్లోనూ పెరిగే అవకాశం
ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే ఆగస్టు 23న నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దేశవ్యాప్తంగా పరీక్షా నగరాలు, పట్టణాలు పెరగనున్నాయి. ఇప్పటి వరకు పరిమిత సంఖ్యలోనే పరీక్ష నిర్వహించే ప్రాంతాలు ఉండేవి. కరోనా వైరస్‌ వ్యాప్తి వల్ల విద్యార్థులు ఎక్కువ దూరం ప్రయాణించకుండా... సమీపంలోనే పరీక్ష రాసేలా పట్టణాలను పెంచాలని ఐఐటీ దిల్లీ నిర్ణయించింది. ఈ ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణను టీసీఎస్‌ అయాన్‌ చేపడుతోంది. పరీక్ష జరిపే పట్టణాలను పెంచాలని ఐఐటీ దిల్లీ అధికారులు టీసీఎస్‌కు సూచించారు. తెలంగాణలో సంగారెడ్డి, సిద్దిపేట, జనగామ, మహబూబాబాద్‌ లాంటి పట్టణాలను పరిశీలించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏపీలోనూ రెవెన్యూ డివిజన్‌ కేంద్రాలను ఎంపిక చేయవచ్చు.
* ప్రస్తుతం ఏపీలో పరీక్షలు జరిగే నగరాలు/పట్టణాలు: విజయనగరం, విశాఖపట్టణం, కాకినాడ, రాజమహేంద్రవరం, ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, విజయవాడ, గుంటూరు, చీరాల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు (మొత్తం 16 చోట్ల).
* తెలంగాణలో..: హైదరాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, కోదాడ (మొత్తం 7 ప్రాంతాలు).

  • Tags