• facebook
  • whatsapp
  • telegram

విద్యార్థులు తక్కువుంటే కోర్సు బంద్‌!

ఈనాడు, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్‌ కోర్సులను హేతుబద్ధీకరణ చేయాలని ఇంటర్‌ విద్యా శాఖ భావిస్తోంది. 20 మంది కంటే తక్కువ విద్యార్థులున్న కోర్సులను మూసివేసి, సంబంధిత అధ్యాపకులను వేరే కళాశాలకు బదిలీ చేస్తారు. విద్యార్థులు తక్కువగా ఉన్న కోర్సులు, కళాశాలలను గుర్తించాలని మే 12న‌ నిర్వహించిన టెలీ కాన్ఫరెన్సులో ఉన్నతాధికారులు సూచించారు. మరోవైపు ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం మే 14 నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేయాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు.

  • Tags