• facebook
  • whatsapp
  • telegram

ఓయూ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు జూన్‌  10

ఈనాడు, హైదరాబాద్‌: ఉస్మానియా వర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షల నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు. మే 12న‌ పరీక్షల నోటిఫికేషన్‌ను వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ప్రొ.శ్రీరాం వెంకటేశ్‌ విడుదల చేశారు. డిగ్రీలోని 2, 4, 6 సెమిస్టర్లకు సంబంధించి రెగ్యులర్‌ విద్యార్థులతోపాటు అన్ని సెమిస్టర్ల బ్యాక్‌లాగ్‌ విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే  13 నుంచి జూన్‌ 10 వరకు పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు విధించారు. రూ.200 ఆలస్య రుసుముతో జూన్‌ 16 వరకు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. కళాశాలల ద్వారానే విద్యార్థులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జూన్‌  12లోగా కళాశాలలు ఆన్‌లైన్‌లో విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులను వర్సిటీకి చెల్లించాలి. ఆలస్య రుసుముతో కలిపి 18లోగా కట్టాల్సి ఉంటుంది. పరీక్షలు జులై మొదటి లేదా రెండోవారంలో నిర్వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

  • Tags