• facebook
  • whatsapp
  • telegram

బిజినెస్‌ స్కూళ్లలో కొవిడ్‌ పాఠాలు

దిల్లీ: కొవిడ్‌-19 మహమ్మారి నేర్పిన అనుభవాలు, వాటి పర్యవసానాలు, దీర్ఘకాలపు గుణపాఠాలు.. దేశంలోని ప్రముఖ బిజినెస్‌ స్కూళ్లలో పాఠ్యాంశాలు కాబోతున్నాయి. మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, వర్క్‌ ఫ్రం హోం కారణంగా మానవ వనరుల నిర్వహణలో వచ్చిన కీలక మార్పులు, ధరల నియంత్రణ, విపత్తుల వేళ వ్యాపార వ్యూహాలు లాంటి కొన్ని అంశాలను పాఠ్యాంశాలుగా మలిచేందుకు చర్చిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే తన సహచరులు మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలోని పరిణామాలను క్షుణ్ణంగా గమనిస్తున్నారని ఐఐఎం (కోల్‌కతా) డైరెక్టర్‌ అన్జు సేథ్‌ తెలిపారు. ఆర్థిక, వ్యాపార వ్యూహాలు, మార్కెటింగ్‌ కోర్సుల్లో ఆయా పాఠ్యాంశాలను ప్రవేశ పెట్టేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు చెప్పారు.

  • Tags