• facebook
  • whatsapp
  • telegram

బీటెక్‌లో 10 నెలల ఇంటర్న్‌షిప్‌

ఈనాడు, అమరావతి: బీటెక్‌ పాఠ్యాంశాల్లో మార్పులు రాబోతున్నాయి. కొత్తగా కొన్ని నైపుణ్య సబ్జెక్టులను ప్రవేశపెట్టడంతోపాటు ఇంటర్న్‌షిప్‌ కాలాన్ని పెంచనున్నారు. బీటెక్‌లో నైపుణ్యాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసేందుకు ఉన్నత విద్యామండలి ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసింది. మొదటి రెండేళ్లల్లో ప్రస్తుతం ఉన్న సబ్జెక్టులకు అదనంగా కొత్తవి తీసుకురానున్నారు. కమ్యూనికేషన్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌, మౌఖిక పరీక్షల సన్నద్ధత వంటివి నేర్పించనున్నారు. మూడు, నాలుగు ఏడాదిలో విద్యార్థుల కోర్సులకు అనుగుణంగా అందించనున్నారు. ప్రస్తుతం చివరి సెమిస్టర్‌ ఆరు నెలలు ఇంటర్న్‌షిప్‌ ఉండగా.. దీన్ని 10 నెలలకు పెంచనున్నారు. మొదటి రెండేళ్లు వేసవి సెలవుల్లో రెండేసి నెలలు చొప్పున ఇంటర్న్‌షిప్‌ను తీసుకురానున్నారు.

  • Tags