• facebook
  • whatsapp
  • telegram

జూనియర్‌ కళాశాలల్లో సెక్షన్‌కు 40 మందే

* విద్యార్థుల సంఖ్య కుదిస్తూ ఉత్తర్వులు
ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌లో సెక్షన్‌కు 40మంది విద్యార్థులనే పరిమితం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సెక్షన్‌కు 88మంది విద్యార్థులకు అనుమతి ఉండగా దీన్ని కుదించింది. కనీసం నాలుగు సెక్షన్లు, గరిష్ఠంగా 9 సెక్షన్ల వరకు అనుమతి ఇవ్వనున్నారు. వీటిల్లో తప్పనిసరిగా కామర్స్‌, ఆర్ట్స్‌ సెక్షన్లు ఉండాలనే నిబంధన పెట్టారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్‌, సీబీఎస్‌ఈ నిబంధనల ప్రకారం తరగతి గదిలో గరిష్ఠంగా 40 మంది విద్యార్థులు ఉండాలని తెలిపింది.

  • Tags