• facebook
  • whatsapp
  • telegram

ఆన్‌లైన్‌ బోధనకు వీడియో పాఠాల రూపకల్పన

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు అందించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. కరోనా కారణంగా అకడమిక్‌ సంవత్సరం ప్రారంభం ఆలస్యం కానుంది. విద్యార్థులు ఇంటి వద్దే పాఠాలు నేర్చుకునేలా వీడియోలు రూపొందించనున్నారు. 7 నుంచి 10 తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులు తమ సబ్జెక్టుల్లో నచ్చిన పాఠాలను వీడియోలుగా రూపొందించి పంపాలని అధికారులు కోరారు.

  • Tags