• facebook
  • whatsapp
  • telegram

రాష్ట్రాల్లోని కళాశాలల్లో  సెప్టెంబరులో బీటెక్‌ తరగతులు

ఈనాడు, హైదరాబాద్‌: ఈసారి జాతీయస్థాయి విద్యా సంస్థల్లో కంటే రాష్ట్రాల్లోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ముందుగా బీటెక్‌ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రాల్లో సెప్టెంబరు 1వ తేదీ నుంచి, ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో అక్టోబరులో తొలి ఏడాది తరగతులకు శ్రీకారం చుట్టనున్నారు. మామూలుగా అయితే రాష్ట్రాల్లోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రతి ఏటా ఆగస్టు మొదటివారంలో, ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో జులై చివరి వారంలో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేది. జేఈఈ మెయిన్‌ను జులై 18-23 మధ్య, అడ్వాన్స్‌డ్‌ను ఆగస్టు 23న జరపాలని నిర్ణయించారు. ఎంసెట్‌ను   జూన్‌ నెలాఖరు నుంచి జులై 18 లోపు ఎప్పుడైనా పరీక్ష నిర్వహించే అవకాశాలను ఉన్నత విద్యామండలి పరిశీలిస్తోంది.

  • Tags