• facebook
  • whatsapp
  • telegram

జూన్‌లో జిల్లాస్థాయి ఇన్‌స్పైర్‌ పోటీలు

ఈనాడు, హైదరాబాద్‌: గత విద్యా సంవత్సరం(2019-20) జరగాల్సిన ఇన్‌స్పైర్‌ జిల్లాస్థాయి పోటీలు జూన్‌ మూడో వారంలో జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) ఆయా డీఈవోలకు ఆదేశాలిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,472 మంది విద్యార్థులు జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా పోటీలు ముగిసిన తర్వాత రాష్ట్రస్థాయి, అనంతరం జాతీయస్థాయి పోటీలను నిర్వహిస్తారు. వచ్చే విద్యా సంవత్సరం(2020-21) ఇన్‌స్పైర్‌ పోటీల రిజిస్ట్రేషన్లు సైతం జూన్‌ మాసంలోనే మొదలుకానున్నాయి.

  • Tags